Breaking News

రాష్ట్రవ్యాప్త సెంట్రల్ కంప్లైంట్స్ సెల్ ఏర్పాటు…

-సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో పోలీసులు స్పందించదగిన ఫిర్యాదులపై రాష్ట్రవ్యాప్త సెంట్రల్ కంప్లైంట్స్ సెల్ ఏర్పాటు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో అక్రమ నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టే ఉచిత వస్తువుల పంపిణి, ఇతరత్రా ఎన్నికల నేరాలను అరికట్టేందుకు మరియు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి. కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్  కాంతి రాణా టాటా పర్యవేక్షణలో ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ నగరంలోని కమాండ్ కంట్రోల్ నందు రాష్ట్రవ్యాప్త సెంట్రల్ కంప్లైంట్స్ సెల్ ను ఈ రోజు అనగా 22.04.2024 తేదిన ఏర్పాటు చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని శాంతిభద్రతలకు సంబంధించిన, అక్రమ నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టే ఉచిత వస్తువుల పంపిణి, ఇతరత్రా ఎన్నికల నేరాలకు సంబంధించిన మరియు పోలీసులు స్పందించదగిన ఎలాంటి సమాచారమైనా నిరంతరం పనిచేసే ఈ క్రింది తెలిపిన టోల్ ఫ్రీ నెంబరుకు తెలియజేయగలరు.

టోల్ ఫ్రీ నెంబర్ : 1800-425-5049
సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని శాంతి భద్రతల పర్యవేక్షణకు మరియు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలీస్ వారితో సహకరిచవలసినదిగా నగర పోలీస్ కమీషనర్ తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *