Breaking News

ఓటు హ‌క్కు వినియోగం.. ప్ర‌తి ఒక్క‌రి క‌ర్త‌వ్యం

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటు హ‌క్కు వినియోగం.. ప్ర‌తి ఒక్క‌రి క‌ర్త‌వ్య‌మ‌ని ఓటు హ‌క్కు ఉన్న ప్ర‌తిఒక్క‌రు త‌ప్ప‌నిస‌రిగా నైతిక బాధ్య‌త‌గా మే 13న ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకోవాలని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు పిలుపునిచ్చారు. అమ‌రావ‌తి యోగా, ఏరోబిక్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం స్థానిక ఇందిరాగాంధీ మునిసిప‌ల్ స్టేడియంలో ఉచిత వేస‌వి ప్ర‌త్యేక యోగా త‌ర‌గ‌తుల‌ను క‌లెక్ట‌ర్ డిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న సిస్ట‌మాటిక్ ఓట‌ర్స్ ఎడ్యుకేష‌న్ అండ్ ఎల‌క్టోర‌ల్ పార్టిసిపేష‌న్ (స్వీప్‌)లో భాగంగా ఓట‌ర్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థను కాపాడి.. దేశ భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఓటు హ‌క్కు అని ప్ర‌జ‌లు గుర్తించాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నిర్లిప్త‌త‌ను తొల‌గించి ఓటింగ్ శాతాన్ని పెంచ‌డంలో విస్తృత ప్ర‌జా భాగస్వామ్యం అవ‌స‌ర‌మ‌న్నారు. ప‌విత్ర‌మైన ఓటు హ‌క్కును ఎలాంటి ప్ర‌లోభాల‌కు తావులేకుండా స్వేచ్ఛ‌గా, నిర్భ‌యంగా వినియోగించుకోవాల‌ని సూచించారు. మే 13న పోలింగ్ జ‌ర‌గ‌నుంద‌ని ఆ రోజు ఓటు హ‌క్కు ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఓటు వేసి ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగ‌స్వాములు కావాల‌ని పేర్కొన్నారు. ఇప్పుడు ఓట‌రుకు స‌మ‌స్త స‌మాచారంతో ఓట‌ర్ ఇన్ఫ‌రేష‌న్ స్లిప్ (వీఐఎస్‌) అందించ‌డం జ‌రుగుతుంద‌ని.. ఓట‌ర్లు త‌మ పోలింగ్ స్టేష‌న్ వివ‌రాల‌ను కూడా తేలిగ్గా తెలుసుకునేందుకు ఈ స్లిప్ ద్వారా వీల‌వుతుంద‌న్నారు. విజ‌య‌వాడ అర్బ‌న్‌లో 85 శాతానికి పైగా ఓటింగ్ శాతం న‌మోద‌య్యేలా విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని.. ఓట‌ర్లు కొత్త చైత‌న్యంతో ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ పోలీస్ కాశీ విశ్వ‌నాథ్‌, యోగా గురువు అంకాల స‌త్య‌నారాయ‌ణ‌, అమ‌రావ‌తి యోగా, ఏరోబిక్స్ అసోసియేష‌న్ కోశాధికారి ఎ.లావ‌ణ్య కుమార్‌, ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ పి.ప్ర‌శాంత్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *