తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు మేరకు ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, అవసరం మేరకు వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వవర్ ఏర్పాటుతో, తగినంత కేంద్ర బలగాలు మోహరింపుతో, రాష్ట్ర పోలీస్ ఏర్పాటు తదితర అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు కలెక్టర్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ తో కలిసి ఈఆర్ఓ లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్, నిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, అదనపు ఎస్పీ వెంకట్రావు తదితర పోలీస్ రెవెన్యూ సంబంధింత అధికారులతో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై సమీక్షిస్తూ కలెక్టర్ మాట్లాడుతూ గతంలో 90 శాతానికి మించి ఓటింగ్ పోలైన పోలింగ్ కేంద్రాలు, గత ఎన్నికలలో శాంతిభద్రతల సంఘటనలు చోటుచేసుకున్న పోలింగ్ కేంద్రాలను తదితర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పరిగణనలోకి తీసుకొని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన వాటిలో సంబంధిత సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, ఆర్డీవోలు సమన్వయంతో వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేసి గుర్తించిన క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో మరియు స్థానాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ రోజున రూట్ సెక్టార్ అధికారులతో సంబంధిత పోలీసు అధికారులు సమన్వయం చేసుకోవాలని, క్రిటికల్ పోలింగ్ స్టేషన్ నందు వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని, అవసరం మేరకు వీడియోగ్రఫీ ఏర్పాటు, కేంద్ర పోలీస్ బలగాలు మోహరింపు వాటితోపాటు రాష్ట్ర పోలీసు బలగాలు స్కేల్ మేరకు ఏర్పాటు ఉండాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుటకు ఇప్పటికే నాలుగు కంపెనీల కేంద్ర బలగాలు జిల్లాకు చేరుకున్నాయని, మరిన్ని బలగాలు జిల్లాకు రానున్నాయని నిష్పాక్షిక ప్రశాంత ఓటింగ్ నిర్వహణకు నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News