Breaking News

ఈ నెల 26న భారత ఉప రాష్ట్రపతి తిరుపతి జిల్లా రాక…

-ఆం.ప్ర రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ నెల ఏప్రిల్25, 26 తేదీలలో తిరుపతి జిల్లా పర్యటన
-భారత ఉప రాష్ట్రపతి పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావు ఉండరాదు: జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్
-బందోబస్తు పక్కాగా నిర్వహణ: ఎస్పి కృష్ణ కాంత్ పటేల్
-ఎఎస్ఎల్ లో భాగంగా ముందస్తు భద్రత ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 26న భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ దన్కర్ తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆం.ప్ర రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు కూడా రానున్నారని, పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని అధికారుల సమన్వయ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ తో కలిసి అధికారులను ఆదేశించారు.

బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన ముందస్తు భద్రత లైజన్ అధికారుల సమన్వయ సమావేశంలోఎస్పీ తో కలిసి కలెక్టర్ మాట్లాడుతూ భారత ఉప రాష్ట్రపతి తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా ఈ నెల ఏప్రిల్ 26న ఉదయం 10.30గం. కు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి 10.35 గం.లకు రోడ్డు మార్గాన తిరుమలకు 11:25 గంటలకు చేరుకుని శ్రీవారి దర్శనానంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుమల నుండి బయలుదేరి 1.00 గంటకు నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ చేరుకుని మూడవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మధ్యాహ్నం 2:30 కు తిరుపతి విమానాశ్రయం చేరుకొని తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు.

భారత ఉప రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈనెల ఏప్రిల్ 25 సాయంత్రం 4:40 గం.కు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని, రాత్రి తిరుపతిలో బస చేయనున్నారని, మరుసటి దినం ఏప్రిల్ 26 న గౌరవ ఉపరాష్ట్రపతి గారిని రేణిగుంట విమానాశ్రయం నందు సాదర స్వాగతం పలికి 11.10 గం.లకు బర్డ్ హాస్పిటల్ మరియు శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ లను సందర్శిస్తారని, అనంతరం భారత ఉపరాష్ట్రపతికి వీడ్కోలు పలికిన అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారని కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని, శానిటేషన్ ఏర్పాట్లు, కాన్వాయ్ వెహికల్స్ ఏర్పాటు, ఎయిర్ పోర్ట్ నందు విఐపి లాంజ్ తదితరాల ఏర్పాటు, ప్రోటోకాల్ అంశాలు తదితర విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున బందోబస్తు పక్కాగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండరాదు అని పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట్రావు, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఏఎస్పీ లు కులశేఖర్, రుయా ఆస్పత్రి అధికారులు, డిసిహెచ్ఎస్ ఆనంద మూర్తి, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, డిఈఓ శేఖర్, ఎయిర్పోర్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *