
-ఎడ్లబళ్లు, గుర్రాలతో కేరింతలు
-గెలుపు గుర్రం నాదేనని జోగి ధీమా
-దేవభక్తుని వర్గం హల్ చల్
పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పదివేల ఓట్ల మెజార్టీతో పెనమలూరు గెలుపు గుర్రం తనదేనని మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మండల రెవెన్యూ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జోగీ రమేష్ మాట్లాడుతూ పెనమలూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి గెలుపులో బడుగు బలహీన వర్గాల నాయకులదేనని పేర్కొన్నారు. జగనన్న ప్రభుత్వం మైనార్టీలకు, దళిత, గిరిజన, బడుగు బలహీనవర్గాల సంక్షేమం, అభివృద్ధికి బాటలు వేసిందన్నారు. అందుకే పెనమలూరు పీఠం తనదేనన్నారు. గెలుపు సునాయాసమేనని ఆనందం వ్యక్తం చేశారు. నామినేషన్ కు పోరంకి సెంటర్ నుంచి ప్రారంభమవగా, దేవభక్తుని ఏడ్లబళ్ళతో ఊరేగింపు ప్రారంభమైంది. తెల్లని గుర్రాలపై ఎక్కి జోగి కుమారులు అభిమానులకు స్వాగతం పలికారు. మంత్రి జోగి రమేష్ వెంబడి జిల్లా కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ తాతినేని పద్మావతి, జిల్లా నాయకులు దైవభక్తుని సుబ్బారావు, వై వైసిపి జిల్లా యువ నాయకుడు దేవభక్తిని చక్రవర్తి, వైసీపీ అభిమానులు, నాయకులు వెంటరాగా ఎమ్మార్వో కి నామినేషన్ పత్రాలు అందజేశారు. నియోజకవర్గంలోని 42 గ్రామాల నుంచి కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తొలుత యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు పూలమాలలతో జోగీని ముంచెత్తారు. దారిపోడవునా పూలవర్షం కురిపించారు.
Prajavartha Online Telugu News