-విలేఖరుల సమావేశంలో ఎఐసిసి పరిశీలకులు మనోజ్ చౌహాన్, ఏ ఐ సి సి మీడియా కోఆర్డినేటర్స్ అనిల్ కుమార్ మరియు సయ్యద్ రఫీ
-విజయవాడ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ చేసిన వల్లూరు భార్గవ్ మరియు అసెంబ్లీ అభ్యర్థులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మే 13వ తేదీన జరగబోవు సార్వత్రిక ఎన్నికలల్లో ఆ మూడుపార్టీలకు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లేనని ఎఐసిసి పరిశీలకులు (ఎపి) మనోజ్ చౌహాన్ అన్నారు. ఈ రోజు విజయవాడ ఆంధ్రరత్నభవన్ లో జరిగిన విలేఖరుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రసంగించారు. ఆయనతో పాటు ఏ ఐ సి సి మీడియా కోఆర్డినేటర్స్ అనిల్ కుమార్ మరియు సయ్యద్ రఫీల సారథ్యంలో విలేకరుల సమావేశం జరిగింది.
కాంగ్రెస్ర్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రత్యేక హెూదా రాష్ట్రానికి తీసుకువస్తామని మొదటిసంతకం ప్రత్యేక హోదా ఫైల్ పైనే ఉంటుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అందరుసహకరించి పార్టీకి విజయాన్ని చేకూర్చాలని ప్రజలను కోరారు. ఈ సమావేశానికి విజయవాడనగర పార్టీ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు అధ్యక్షత వహించారు. పార్లమెంటు అభ్యర్థి వల్లూరుభార్గవ్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ విజయవంతంగా చేసిన భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయయాత్ర మరియు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి చేస్తున్న రాజకీయ పోరాటపటిమ నన్ను చైతన్యవంతుడ్ని చేసిందని అందుకే పార్టీలో చేరానని లోక్ సభ అభ్యర్థి గా నామినేషన్ వేశానని తెలిపారు. మాతోపాటు ఏడు నియోజక వర్గాల పార్టీ అభ్యర్థులను కూడా సహకరించి విజయంచేకూర్చపెట్టాలని కోరారు.
ఈ విలేఖరుల సమావేశంలో లోక్ సభ అభ్యర్థి మరియు శాసనసభ అభ్యర్థులను మీడియాకు పరిచయం చేశారు.ఈ సమావేశానికి పార్టీ ఉపాధ్యక్షులు వి. గుర్నాధం, ఎఐసిసి సభ్యులు మేడా సురేష్, అన్సారి, పి నాంచారయ్య, బేగ్, జోసఫ్, ఇండియా కూటమిలోని భాగస్వాములైన సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News