Breaking News

కులాల మధ్య చిచ్చుపెడుతున్న కూటమిని ఓడించాలి… : జి.కోటేశ్వరరావు

– గత ఏడాది ఎక్కడ ఉన్నావు సుజనా…
– ఎన్నికల తర్వాత ఎక్కడ ఉంటావు..?
– ఎన్నికల ముందు వచ్చి పశ్చిమ ప్రజలకు ఆకాశమంత పందిరి వేస్తావా?
– ఇటువంటి స్వార్థపరులను, అవినీతిపరులను ప్రజలు ఓడిరచాలి
– బీజేపీకి వంతపాడుతున్న వైసీపీని గద్దె దించాలి
– నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్టులను గెలిపించండి
– సీపీఐ పశ్చిమ అభ్యర్థి జి.కోటేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రశాంతంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో తన స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఇండియా కూటమి బలపరిచిన సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు పొందాలని ప్రయత్నిస్తున్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను ప్రజలు ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. జి.కోటేశ్వరరావు గురువారం 49, 50 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి వీధిలోనూ సీపీఐ అభ్యర్థికి ప్రజలు ఘన స్వాగతం పలికి గతంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజాప్రతినిధులు అందించిన సేవలను గుర్తుచేసుకుని మళ్లీ కమ్యూనిస్టులు రావాలనే ఆకాంక్షను బలంగా వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ ‘బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత సీటు పొంది ఇక్కడికి వచ్చి కులాలవారీగా మీటింగ్‌లు పెట్టి మీకు ఆకాశమంత పందిరి వేస్తాం.. భూదేవంత పీఠం వేస్తా… అని మభ్యపెడుతున్నారు. కులాల వారీగా, మతాల వారీగా మీటింగ్‌లు పెట్టి ప్రజలను చీల్చి ఓట్లు పొందాలని కుట్రలు చేస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇస్తున్నారు. అసలు మీరు గత సంవత్సరం ఎక్కడ ఉన్నారు… అంతకుముందు సంవత్సరం ఎక్కడ ఉన్నారు. రేపు ఎన్నికల తర్వాత ఎక్కడ ఉంటారో సూటిగా సమాధానం చెప్పండి… మీకు విజయవాడ నగరంతో ఏమి సంబంధం లేదు. నేను ఇక్కడే కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉంటున్నా… ఈ పక్కనే ఉన్న కేబీఎన్‌ కాలేజీలో చదువుకున్నా… నేను ఏ ఒక్క బ్యాంకుకు పైసా ఎగ్గొట్టలేదు.. కానీ బ్యాంకులకు రూ.5,700 కోట్లు ఎగ్గొట్టిన సుజనా చౌదరి ఇవాళ తగుదునమ్మా అంటూ ప్రజల మధ్యకు రావడం సిగ్గుచేటు. ఎన్నికలు అంటే కోట్లు ఉండాలని చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి కోట్లు అవసరం లేదు… ప్రజల మద్దతు చాలు అని కమ్యూనిస్టులకు అనేకమార్లు ఇక్కడి జనం పట్టం కట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ఒకవైపు… బీజేపీకి వంతపాడుతున్న వైసీపీ మరోవైపు ఉన్నాయి. వారిలో ఎవరు గెలిచినా ఒక్కటే… అందరూ మోడీ నీడలో ఉండేవారే… కాబట్టి కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనుగోలు చేయాలనుకునే కోటీశ్వరులు ఒకవైపు… ప్రజల సమస్యలపై స్పందించే కమ్యూనిస్టులు, కమ్యూనిస్టులు మరోవైపు పోటీలో ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు పన్నుల భారం లేని, వివక్ష లేని పారదర్శక పాలన కోసం ఇండియా కూటమి బలపరిచిన కమ్యూనిస్టులను గెలిపించాలి..’ అని కోటేశ్వరరావు కోరారు. సీపీఎం మాజీ కార్పొరేటర్‌ గాదె ఆదిలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పేదలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే రూపాయికే టిడ్కో ఇళ్లు రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని మభ్య పెట్టి ఓట్లు దండుకుని ఐదేళ్లలో ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదని చెప్పారు. మరోవైపు అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెబుతున్నారని, ఆచరణలో మాత్రం డ్వాక్రా మహిళలకు రుణాల మంజూరు నుంచి ప్రతి పనికీ ఒక రేటు కట్టి వసూలు చేస్తున్నారని తెలిపారు. అందువల్లే నిరంతరం ప్రజల పక్షాన పోరాడే కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *