Breaking News

కల్యాణం కమణీయం శ్రీ భవాని శంకర కళ్యాణమహోత్సవం


-వందలాది భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో శుక్ర‌వారం శ్రీభ‌వానీ శంక‌ర క‌ళ్యాణాన్ని మందిరంలో భ‌క్తుల జ‌య‌జ‌య‌ధ్వానాల న‌డుమ నేత్ర‌ప‌ర్వంగా జ‌రిగింది. క‌ల్యాణోత్స‌వంలో సాయిబాబా మందిరం గౌర‌వాధ్య‌క్షుడు పూనురు గౌతంరెడ్డి, ఉష‌ దంప‌తులు, శివ‌లింగ దాత డి.ల‌క్ష్మ‌ణ‌రెడ్డి, మ‌ణి దంప‌తులు పాల్గొని భ‌క్తిశ్ర‌ద్థ‌ల‌తో క‌ల్యాణాన్ని నిర్వ‌హించారు. క‌ళ్యాణ మహోత్సవాన్ని ఆల‌య వేద పండితులు శ‌స్త్రోక్త‌కంగా నిర్వ‌హించ‌గా కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ గాయ‌కుడు గ‌జ‌ల్ శ్రీనివాస్ పాల్గొని క‌ళ్యాణాన్ని వీక్షించారు. మందిరంలో సాయిబాబాను ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు జ‌రిపారు. అనంత‌రం భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ గావించారు. కార్య‌క్ర‌మంలో మందిరం కోశాధికారి ఎం.స‌త్యశ్రీహ‌రి, క‌మిటీ స‌భ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *