-సుజనా నోట దమ్మున్నమాట
-పశ్చిమలో ఎక్కడ చూసినా ఇదే చర్చ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇచ్చిన హామీలు అమలు చేయని పక్షంలో ప్రజా ప్రతినిధులను రీ కాల్ చేసే విధానం రావాలని పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అభిప్రాయపడుతున్నారు. దేశంలో ప్రస్తుతం ఈ విధానం లేకపోయినా రీకాల్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
సహజంగా రాజకీయ నాయకులు రీకాల్ విధానాన్ని అంగీకరించరు. అయితే ఈ విధానాన్ని అమలు చేయడం అవసరమేనని సుజనా చౌదరి అభిప్రాయపడుతున్నారు.ఎన్నికల సమయంలో నాయకులు ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తుంటారు. ఎన్నికల్లో గెలిచాక ప్రజల గురించి పట్టించుకోకుండా మొహం చాటేస్తుంటారు. ఇలాంటి నేతలు మరోసారి ప్రజల్లోకి రాకుండా ఉండాలంటే రీకాల్ చేయాలన్నది సుజనా చెబుతోన్న మాట… మాట తప్పే నాయకులను వెనక్కు రప్పించే విధానం వస్తే ప్రజలకు మేలు జరుగుతోందని ఇప్పుడు జరుగుతోన్న చర్చ.. ఇదే జరిగితే ప్రజా ప్రతినిధులు ప్రజల కోసం తప్పనిసరిగా పని చేసే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విధానం ఇప్పటి రాజకీయ వ్యవస్థలో ఉండాల్సిందేనని సుజనా గట్టిగా విశ్వసిస్తున్నారు. కొద్దిరోజులుగా పశ్చిమలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం లో సుజనా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రీకాల్ విధానం గనుక అమలు జరిగితే అందుకు తాను సైతం సిద్ధమేనని సుజనా ధీమాగా చెబుతున్నారు. ఎంతో ఆత్మ విశ్వాసంతో సుజనా రీకాల్ అంశాన్ని ప్రస్తావిస్తున్న విధానాన్ని ప్రజలు హర్షిస్తున్నారు.
Prajavartha Online Telugu News