Breaking News

మ‌ద్యం, డ‌బ్బు అక్ర‌మ ర‌వాణాపై ఉక్కుపాదం

– చెక్‌పోస్టుల వ‌ద్ద నిరంత‌రం నిఘా క‌న్ను
– నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు
– అదనపు బృందాల ఏర్పాటుకు చర్యలు
– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు, పోలీస్ క‌మిష‌న‌ర్ పీహెచ్‌డీ రామ‌కృష్ణ హెచ్చ‌రిక‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధార‌ణ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చెక్‌పోస్టుల వ‌ద్ద నిరంత‌రం నిఘా నేత్రం ప‌ర్య‌వేక్ష‌ణ కొన‌సాగుతోంద‌ని.. మ‌ద్యం, డ‌బ్బు త‌దిత‌రాల అక్ర‌మ ర‌వాణాపై ఉక్కుపాదం మోపుతామ‌ని.. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు, పోలీస్ క‌మిష‌న‌ర్ పీహెచ్‌డీ రామ‌కృష్ణ హెచ్చ‌రించారు.
శ‌నివారం జిల్లా క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌య స‌మావేశ మందిరంలో జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. సీపీ పీహెచ్‌డీ రామ‌కృష్ణ‌, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ శుభం నోఖ్వాల్‌తో క‌లిసి పోలీస్‌, ఎక్సైజ్‌, స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. వివిధ ర‌కాల మ‌ద్యం సీజ‌ర్లు, చెక్‌పోస్టుల వ‌ద్ద నిఘా, ఫ్ల‌యింగ్ స్క్వాడ్స్ కార్య‌క‌లాపాలు, బైండోవ‌ర్లు, ఉల్లంఘ‌న‌ల‌పై న‌మోదు చేసిన కేసులు త‌దిత‌రాల‌పై స‌మీక్షించారు. తొలుత వివిధ శాఖ‌ల అధికారులు మ‌ద్యం ఉల్లంఘ‌న‌లు, తీసుకున్న చ‌ర్య‌ల వివ‌రాలు తెలియ‌జేశారు. 2024, మార్చి 16 నుంచి ఏప్రిల్ 26వ‌ర‌కు చూస్తే రూ. 3.13 ల‌క్ష‌ల విలువైన 1,052 లీట‌ర్ల కాపుసారాకు సంబంధించి 38 మందిని అరెస్టు చేసిన‌ట్లు అధికారులు వివ‌రించారు. అదే విధంగా రూ. 16.88 ల‌క్ష‌ల విలువైన గంజాయి ర‌వాణా విష‌యంలో 29 మందిని అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్క‌ర్‌, డ్యూటిపైడ్ లిక్క‌ర్‌కు సంబంధింఛిన ఉల్లంఘ‌న‌లు, కేసుల న‌మోదు త‌దిత‌రాల‌ను కూడా వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ ఈసీఐ, సీఈవో మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా జిల్లాలో ఎక్క‌డా అక్ర‌మ మ‌ద్యం, డ‌బ్బు, విలువైన వ‌స్తువులు త‌దిత‌రాల ర‌వాణా అనేది లేకుండా చేసేందుకు అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దు చెక్‌పోస్టుల‌తో స‌హా జిల్లాలోని వివిధ చెక్‌పోస్టుల ద్వారా క‌ట్టుదిట్ట‌మైన నిఘాను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని.. ఫ్ల‌యింగ్ స్క్వాడ్స్ బృందాలు, స్టాటిక్ స‌ర్వైలెన్స్ బృందాలు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నాయ‌ని.. నిఘాను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మ‌రింత పెంచే ఉద్దేశంతో అద‌న‌పు బృందాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. అదే విధంగా వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తూ త‌నిఖీల‌ను ముమ్మ‌రం చేయాల‌ని.. ప్ర‌ధాన మార్గాల‌తోపాటు డొంక మార్గాల‌పైనా దృష్టిసారించాల‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు సూచించారు.
పోలీస్ క‌మిష‌న‌ర్ పీహెచ్‌డీ రామ‌కృష్ణ మాట్లాడుతూ మ‌ద్యం దుకాణాలు, డిస్టిల‌రీలు, డిపోలు, బాట్లింగ్ యూనిట్లు త‌దిత‌రాలపై నిఘా ఉంటోందని.. ఎక్సైజ్ కంట్రోల్ కేంద్రంగా ఇప్ప‌టికే సీసీటీవీల ఫుటేజీ డేటా విశ్లేష‌ణ జ‌రుగుతోంద‌ని.. అయితే మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా, నాణ్య‌మైన విశ్లేష‌ణ‌కు, త్వ‌రిత‌గ‌తిన చ‌ర్య‌ల‌కు వీలుగా పోలీస్ కంట్రోల్ రూం కేంద్రంగా కూడా ఈ కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. అక్ర‌మాలు, ఉల్లంఘ‌న‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఎలాంటి ప్ర‌లోభాల‌కు తావులేకుండా శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో భాగంగా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిఘా ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింద‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. స‌మావేశంలో డిస్ట్రిక్ట్ సూప‌రింటెండెంట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస‌ర్ రామ‌కృష్ణ ప్ర‌సాద్‌, డిస్ట్రిక్ట్ ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ ఆఫీస‌ర్ శ్రీనాథుడు, స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూప‌రింటెండెంట్ కోటేశ్వ‌ర‌రావు, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూప‌రింటెండెంట్ (విజ‌య‌వాడ‌) ఆర్‌వీ రామ‌శివ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *