Breaking News

ఓటుహక్కును ఎలా వినియోగించుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనరల్ అబ్సర్వర్ నరేందర్ సింగ్ బాలి శనివారం మైలవరం నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి, జూపూడి, దాములూరు, కొటికలపూడి, మూలపాడు, కేతనకొండ గ్రామాల లోని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ రోజు ఓటర్లకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు, వెలుతురు ఉండేలా లైటింగ్, మరుగుదొడ్లు, వేసవి దృష్ట్యా షామియానా వంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నంలోని నిమ్రా మెడికల్ కాలేజ్ నందు స్ట్రాంగ్ రూమ్ పరిశీలించారు. నిమ్రా మెడికల్ కాలేజ్ నందు క్రొత్త ఓటర్లుగా నమోదు అయిన విద్యార్థులతో సమావేశమై ఓటు యొక్క ప్రాముఖ్యత, వోటర్ భాద్యత, మన ఓటుహక్కును ఎలా వినియోగించుకోవాలి అని అవగాహన కల్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *