రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సువిధా ఎన్ కోర్ అనుమతులు, సి విజిల్ ఫిర్యాదుల విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు కమల్ కాంత్ సరోఛ్ పేర్కొన్నారు. కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఎన్ కోర్ , సి విజిల్ విభాగాలను కమల్ కాంత్ సరోఛ్ సందర్శించి, రిజిస్టర్ల్స్ నిర్వహణా తీరును పరిశీలించారు. ఈ సందర్బంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు కమల్ కాంత్ సరోఛ్ ఇప్పటి వరకు సువిధా విభాగం ద్వారా ఇచ్చిన వివిధ అనుమతులు, తిరస్కరించిన వాటి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సి విజిల్ విభాగం, ఎమ్ సి సి విభాగాలను పరిశీలించడం జరిగింది. సి విజిల్ కు వస్తున్న ఫిర్యాదులను సగటున 32 నిముషాల 59 సెకండ్ల లో పరిష్కారం చేస్తున్నట్లు అధికారులు తెలియ చేశారు.
సువిధా ద్వారా పార్లమెంటు, అసెంబ్లి నియోజక వర్గాల పరిధిలో 968 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 820 అనుమతించగా, 116 తిరస్కరించినట్లు, 32 పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. తిరస్కరణ కు సంబంధించి కారణాలు తెలియ చెయ్యడం జరిగిందన్నారు. సింగిల్ విండో విధానంలో అనుమతులు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నట్లు నోడల్ అధికారి ఏ. ముఖలింగం వివరించారు. అనుమతులను 24 గంటల్లోగా జారీ చేసి , వాటి వివరాలు వ్యయ విభాగం, ఎన్ఫోర్స్ మెంట్ విభాగాల వారికీ తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సి విజిల్ కు మొత్తం 608 కాల్స్ రాగా 475 పరిష్కారము చేశామని, 133 కాల్స్ సాధారణ సమాచారం కోసం చేసినట్లు నోడల్ అధికారులు రుడా విసి బి.బాలస్వామి, మార్కెటింగ్ ఏ డీ ఎమ్. సునీల్ వినయ్ లు తెలిపారు. ఎం సి సి సంభందించి ఉల్లంఘన కింద వాహనాల దుర్వినియోగం, లౌడ్ స్పీకర్లు, అనధికార సమావేశాలు, తదితర అంశాలపై 23 నోటీసులు జారీ చేసి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, డ్వామా పిడి ఏ.. ముఖ లింగం, రుడా విసి బి.బాలస్వామి, మార్కెటింగ్ ఏ డీ ఎమ్. సునీల్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News