మే 1వ తేదిన సామాజిక భద్రత పెన్షన్ల చెల్లింపుకు చర్యలు

-ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ప్రణాళికా
-దివ్యాంగులు, అనారోగ్య కారణాల రీత్యా బెడ్ రీడన్, సైనిక కుటుంబాల తదితర ప్రత్యేక కేటగిరిలకు ఇంటి వద్దనే పంపిణీ
-మిగిలిన వారికి బ్యాంకు ఖాతాలకు డి బి టి ద్వారా జమ
-కలెక్టర్ కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మే 1వ తేదీన సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అధికార యంత్రాంగం సమగ్రమైన ఏర్పాట్లను చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు అనుగుణంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం విజయవాడ నుంచి పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషన్ కుమార్ కలెక్టర్లు, డి ఆర్ డీ ఏ, జీఎస్ డబ్ల్యూఎస్, బ్యాంకు అధికారులతో సామాజిక పెన్షన్ పంపిణీ పై విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ మాధవీలత, డి ఆర్ డీ ఏ పీడీ ఎన్ వివి మూర్తి, డివిజనల్ అభివృద్ది అధికారి పి, వీణా దేవి, ఎల్ డి ఎమ్ డి వీ ప్రసాద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు డా కే. మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 2,42,000 మంది సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం రు. 72 కోట్ల మేర మే 1వ తేదిన సామాజిక భద్రత పెన్షన్ల చెల్లింపుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా మే 1 వ తేదీ సెలవు రోజైన చెల్లింపులు జరిగేలా రాష్ట్ర స్థాయి అధికారులూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.  దివ్యాంగులు, అనారోగ్య కారణాల రీత్యా బెడ్ రీడన్, సైనిక కుటుంబాల తదితర ప్రత్యేక కేటగిరి కింద గుర్తించిన వారికీ ఇంటి వద్దనే చెల్లింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఏప్రియల్ 30 వ తేదీన నగదు ఉపసంహరణ కోసం బ్యాంకర్ల కు ఆదేశాలు జారీ చేశారన్నారు.  సచివాలయం సిబ్బంది ద్వారా మే 1 , 2 తేదీల్లో చెల్లింపులు జరుపుతారని మాధవీలత తెలియ చేశారు.
మిగిలిన వారికి వారి బ్యాంకు ఖాతాలకు మే ఒకటవ తేదీన బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు. నగదు బదలీ (డిబిటీ) ద్వారా ఆయా పెన్షన్ దారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. నేరుగా పెన్షన్ దారుల ఖాతాలో జమ చేసినా పెన్షన్ మొత్తం డిజిటల్ మోడ్, బ్యాంకు కలెక్షన్ సెంటర్, ఏ టి ఎమ్ ల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. మే 2 వ తేదీన బ్యాంకులకు వెళ్ళి నేరుగా డ్రా చేసుకునే అవకాశం ఉందని, ఆమేరకు బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఎల్ డి ఎమ్ ల ద్వారా సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. సాంకేతిక పరమైన కారణాల వల్ల పెన్షన్ సొమ్ము బ్యాంకు ఖాతాలకు జమ కానీ ఎడల అటువంటి వారిని గుర్తించి సచివాలయ సిబ్బంది ఇంటి వద్దనే మే 3 వ తేదీ నుంచి 5 వ తేదీ వరకు చెల్లింపులు జరుపుతారని మాధవీలత తెలియ చేశారు. ఎవ్వరూ పెన్షన్ల కోసం సచివాలయాలకు రావద్దని కలెక్టర్ తెలియ చేశారు. క్షేత్ర స్థాయిలో ఆమేరకు నగపాలక సంస్థ మునిసిపల్ కమిషనర్, మండల అభివృద్ది అధికారులు, పురపాలక సంఘాల కమిషనర్లు, డివిజనల్ అభివృద్ది అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. వార్డులో, పంచాయతీల పరిధిలో ప్రచారం కోసం ” టాం – టాం ” చెయ్యాలని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *