Breaking News

న్యాయ విజ్ఞాన సదస్సు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు మరియు కార్మిక శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక శ్రీరాంపురమ్ లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యతాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు వారి హక్కులు మరియు సంక్షేమం కోసం చేయబడ్డ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కార్యదర్శి అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా కార్మికులకు కల్పించబడిన హక్కుల గురించి వివరించారు. “అసంఘటిత కార్మికుల కోసం జాతీయ న్యాయసేవాధికార సంస్థ వారి న్యాయ సేవల పథకం, 2015” గురించి అవగాహన కల్పించారు. కార్మికులకు ఎలాంటి న్యాయ సమస్య ఎదురైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ అధికారి టి.యస్. కార్తిక్ , ఆటో యూనియన్ సభ్యులు, భవన నిర్మాణ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *