Breaking News

ఎన్నికల నిబందనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు…

-నగర కమిషనర్ & తూర్పు ఆర్ఓ కీర్తి చేకూరి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఉద్యోగులు, అప్కాస్ ఉద్యోగులు ఎవరైనా రాజకీయ పార్టీల ప్రచారాల్లో పాల్గొన్నా, ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపి ఎంఎల్ఏ అభ్యర్ధి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నజిఎంసి ఔట్సొర్సింగ్ కార్మికురాలు గార్లపాటి లక్ష్మీని విధుల నుండి తొలగిస్తూ కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల్లో విధులు నిర్వహించే ఔట్సొర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు ఏ విధమైన రాజకీయ పార్టీల సభల్లోను, ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనకూడదన్నారు. ఇటీవల గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపి అభ్యర్ధి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నగరపాలక సంస్థ 16వ శానిటరీ డివిజన్ 140వ వార్డ్ సచివాలయం పరిధిలో ఔట్సొర్సింగ్ విధానంలో ప్రజారోగ్య కార్మికురాలు గార్లపాటి లక్ష్మీని తక్షణం విధుల నుండి తొలగించామని తెలిపారు. ఎన్నికల నిబందనలు ఉల్లంఘన చేసే వారిని ఉపేక్షించబోమని, ప్రతి ఒక్కరూ నిబందనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *