Breaking News

ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల‌ ప్రచారం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల‌ ప్రచారం నిర్వహించనున్నారు.! ఈ క్రమంలోనే ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల‌ 7, 8 తేదీలలో రోడ్ షో, సభలు నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో సభలో మోదీ ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొనున్నారు. 8 న సాయంత్రం 4.00 గంటలకు పీలేరు సభలో ప్రసంగించనున్నారు. రాత్రి 7.00 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకూ ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *