-బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టిడిపి, జనసేన,బిజెపి ఓటమికి మా మద్దతు అని తెలిపారు. ఈ సందర్భంగా గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రవ్యాప్తంగా సమావేశాన్ని గుంటూరు లో నిర్వహించాం సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించా ము ప్రస్తుత ప్రభుత్వం ఇసుక, మైనింగ్, లిక్కర్, వంటి కుంభకోణాలలో కూరుకు పోయిందని, బీసీ సంక్షేమ సంఘం రాబోయే ఎన్ని కల్లో తెదేపా జనసేన భాజపా కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం. వైకాపా ప్రభుత్వంలో బీసీలకు ఎటువంటి న్యాయం జరగలేదని, నా ఎస్సి, నా ఎస్టి, నా మైనారిటీ అని మాట్లాడే ముఖ్యమంత్రి ఒక బీసీ ఐఏఎస్ అధికారి రవిచంద్రకు ఆరు నెలలుగా ఎటువంటి పోస్టింగు ఇవ్వకుండా ఎందుకు ఉంచారని ప్రశ్నిస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో తెదేపా జనసేన భాజపా కూటమి అభ్యర్థులను గెలిపించా ల్సిందిగా కోరుతున్నాము.
ఎన్డీఏ కూటమి అధికారం లోకి వచ్చాక బీసీలకు న్యాయం చేయాలని కోరాము వైకాపా హయాంలో బీసీలపై దాడులు హత్యలు విపరీతంగా పెరిగిపో యాయి. రాష్ట్రం అభివృ ద్ధి లేక అధోగతి పాలయిం దని అన్నారు. అభివృద్ధి తో పాటు సంక్షేమాన్ని అందించే ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఉంది అని చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు అభివృద్ధితో పాటు సంక్షేమం అందిస్తా రని నమ్ముతున్నాం.
రాష్ట్రంలో బీసీలందరూ తెదేపా, భాజపా, జన సేన, అభ్యర్థులను గెలిపిం చాలని కోరుతున్నాం అని అన్నారు. కూటమి అభ్యర్థులైన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) బిజెపి అభ్యర్థి వై.సుజనా చౌదరి, పాటు ఎన్టీఆర్ జిల్లాలోని మిగతా శాసన సభ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న తెలుగు దేశం పార్టీ అభ్యర్థులం దరినీ గెలుపు కోసం కృషి చేయాలని సంఘం నిర్ణయించిందని, దళిత, గిరిజన, మైనార్టీ, బలహీన వర్గాల, ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమ అభివృద్ధితోపాటు అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగి సమాగ్రాభివృద్ధి చెందా లంటే ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు. ఈ సమావేశంలో చిపాడ చందు, బీసీ సంక్షేమ సంఘం విజయవాడ పట్టణ అధ్యక్షులు, కుమ్మర క్రాంతి కుమార్, ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ, ఎన్.వి. రావు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, బాయన శేఖర్ బాబు, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News