Breaking News

దళితులపై జరుగుతున్న దాడులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయం,,, :  కట్టిపోగు బసవరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కే.బసవరావు మాట్లాడుతూఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎస్సీ కమిషన్ లో మెంబర్ గా నేను రెండు సంవత్సరాలు పని చేయడం జరిగింది. తర్వాత నేను రాజీనామా చేసి ఈ కమిషన్ నుంచి బయట రావడం కూడా జరిగింది.ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు,
ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్య నేరాలు, దళితుల మీద.జరుగుతున్నటువంటి ఒక మానభంగాలు, అవమానాలు కావచ్చు అని, వాటి గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయవలసిన బాధ్యత నాకు ఉంది. దళితులను చంపిన వారినే సీఎం వెనుకేసుకుని వస్తున్నారని అన్నారు. ఎస్సీ ,ఎస్టీ లపై జరిగిన దాడులు, హత్యలపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. ఎప్పటికప్పుడు సీఎం ఎస్సీ కమిషన్ తో చర్చించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ చట్టం అమలు విషయంలో ప్రజాప్రతినిధుల జోక్యం ఉండకూడదని, కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఎస్సీ కమిషన్ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని, డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా దళితులపై వ్యవహరిస్తుందని అన్నారు.ఈ సమావేశంలో పులి ప్రభుదాస్, రావూరి సుధీర్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *