Breaking News

ప్రిసైడింగ్ అధికారుల పాత్ర ఎన్నికల నిర్వహణలో కీలకం

-పి.ఓ డైరీ మరియు ఇతర పత్రాలు ఎప్పటికప్పుడు ప్రిసైడింగ్ అధికారులు నమోదు చేయాలి
-ప్రిసైడింగ్ అధికారులు హ్యాండ్ బుక్ చదివి పూర్తి అవగాహన కలిగి పక్కాగా ఎన్నికల నిర్వహణ చేయాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు వారికి కేటాయించబడిన ఎన్నికల విధులను ఎంతో పకడ్బందీగా, ప్రిసైడింగ్ అధికారి హ్యాండ్ బుక్ మేరకు, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చేపట్టాలని, నిష్పాక్షిక పారదర్శక ఎన్నికలకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలల్లో సదరు నియోజక వర్గానికి విధులు కేటాయించబడిన పీ.ఓ, ఎపీఓ లకు సదరు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులు ఆన్ హ్యాండ్ శిక్షణ కార్యక్రమం జిల్లా యంత్రాంగం నిర్వహించగా తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గానికి పోలింగ్ విధులకు కేటాయించబడిన పీ.ఓ, ఎ.పీ.ఓ లకు కచ్చపి మునిసిపల్ ఆడిటోరియం నందు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో సాధారణ ఎన్నికలు 2024 లోక్ సభ మరియు శాసన సభ ఎన్నికల నిర్వహణ లో పి.ఓ ల పాత్ర చాలా కీలకమని, ఎప్పటికప్పుడు ఎన్నికలు కొత్తగా చూడాలని, పీ.ఓ హ్యాండ్ బుక్ చదివి పూర్తి అవగాహన కలిగి ఉండాలి అని, అప్పుడు ఎన్నికల నిర్వహణ సులువు అవుతుందని అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రంలో పి.ఓ లు విధులు నిర్వహించాలన్నారు.
ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈ ప్రక్రియను ఉదయం 6.30 గం. లలోపు పూర్తి చేయాలని అన్నారు. మాక్ పోల్ జరపకుండా పోలింగ్ ప్రారంభించకూడదని, ఉదయం 7 గంటల కల్లా పోలింగ్ ప్రారంభించాలన్నారు. పి.ఓ డైరీ, పి .ఓ రిపోర్ట్ ఇతర పత్రాలు ఎప్పటికప్పుడు పి.ఓ లు నమోదు చేయాలనీ సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సంబంధిత సెక్టర్ అధికారికి, రిటర్నింగ్ అధికారికి తెలియ చేయాలన్నారు. ఈవిఎం మరియు పోలింగ్ కేంద్రాలలో సమస్య లు ఉంటే సెక్టోరియల్ అధికారికి తెలియజేయాలని అన్నారు. విధులు కేటాయించబడిన పి.ఓ లు, ఏపీఓ లు, ఇతర పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి ఈవిఎంలను పోలింగ్ సామాగ్రిని తీసుకెళ్లేటప్పటి నుండి తిరిగి ఈవీఎంలను రిసెప్షన్ కేంద్రంలో అప్పగించే వరకు బాధ్యతగా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఈవిఎం లు, సంబంధిత ఫారాలను పూరించడం తదితరాలను హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు తుది జాబితా తయారైన మేరకు, తిరుపతి నియోజక వర్గంలో మూడు బ్యాలెట్ యూనిట్ల అవసరం ఉంటుందని, పీ.ఓ, ఎపీఓ లకు పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సెక్టార్ అధికారులు జిల్లా ఎన్నికల అధికారికి కళ్ళు చెవులు వంటి వారు అని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రిసైడింగ్ అధికారి రోల్ చాలా ముఖ్యమని అన్నారు. తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు ఉంటుందని, క్రిటికల్, వల్నరబుల్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు ఉంటుందని, అవసరం మేరకు వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తున్నామని, సి ఆర్ పి ఎఫ్ తదితర కేంద్ర బలగాలు మన రాష్ట్ర పోలీస్ తో పాటు తగినంత ఏర్పాటు చేస్తున్నామని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలింగ్ నిర్వహణకు హాజరవుతున్న మీ అందరి సురక్షితం మా బాధ్యత అని, సమిష్టిగా మనమందరం కలిసి మన జిల్లాలో సాధారణ ఎన్నికలు 2024 లను విజయవంతం చేద్దామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణపై పలు వీడియోలు ఉన్నాయని రిఫరెన్స్ కోసం వాటిని చూడాలని సూచించారు. తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నందు ఏర్పాటు చేశారని మే 12వ తేదీ ఉదయం 7.30 గం.లకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని, బాధ్యతగా పనిచేయాలని తెలిపారు.

అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందలి ధృతి ఆడిటోరియం నందు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పీ.ఓ మరియు ఏపిఓ శిక్షణ కార్యక్రమానికి హాజరై దిశా నిర్దేశం చేశారు. చంద్రగిరి నియోజక వర్గంలోనీ అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులు సంబంధిత ఓటరుకు బిఎల్వో లు అందించాల్సి ఉంటుందని, తద్వారా సక్రమమైన ఎఎస్డి లిస్ట్ తయారీ అవుతుందని ఎలాంటి ఆరోపణలకు తావివ్వరాదని అన్నారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిని అదితి సింగ్, చంద్రగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిషాంత్ రెడ్డి, తదితర అధికారులు పీ.ఓ లు, ఎపిఓలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *