గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 3వ తారీఖున గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించే హోం ఓటింగ్ ను పకడ్బందీగా నిర్వహించానికి 11 బృందాలను ఏర్పాటు చేశామని నగర పాలక సంస్థ అదనపు కమీషనర్, పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్.ఓ) కె. రాజ్యలక్ష్మి గురువారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు.
ఈ సందర్భంగా అదనపు కమీషనర్, ఆర్.ఓ మాట్లాడుతూ, 2024 సంవత్సరంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా అమలు చేయుచున్న హోం ఓటింగ్ విధి, విధానాల పై ప్రతి ఒక్కరికి సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. మే 3, శుక్రావారం ఉదయం 7 గంటల నుండి హోం ఓటింగ్ ప్రారంభమౌంతుందని, హోం ఓటింగ్ ను రహస్య ఓటింగ్ విధానంలో చేపటతామని తెలిపారు. ఓటింగ్ జరుగు సమయంలో ఓటింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో వీడియో రికార్డ్ చేయట జరుగుతున్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియలో పోటీలో ఉన్న అభ్యర్ధులు లేదా వారి పోలింగ్ ఏజంట్లు కూడా ఉండవచ్చని, కాని వారు ఎటువంటి ప్రచారం గాని, పార్టీ గుర్తులు ప్రదర్శించకూడదనన్నారు. ఓటు వేసే వారికి ప్రత్యేక కంపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. హోం ఓటింగ్ సమయంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసు సిబ్బంది ఉంటారని, ఎన్నికల కమిషన్ నిబందనలను తుచ తప్పకుండా కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో హోమ ఓటింగ్ నిర్వహణ కోసం 11 బృందాలను ఏర్పాటు చేశామమని, ఆయా బృందాలను పర్యవేక్షణకు ఏఆర్ఓల ఆధ్వర్యంలో మైక్రో అబ్జర్వర్ల టీంలను కూడా నియమించుట జరుగుతుందని తెలిపారు. ఒక్కో బృందానికి రూట్ మ్యాప్ సిద్దం చేశామని, పోలింగ్ స్టేషన్ల వారిగా విధులు కేటాయించబడిన సిబ్బంది సంబందిత బిఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలన్నారు. సెక్టార్ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
Prajavartha Online Telugu News