Breaking News

ఈవిఎంల కమిషనింగ్ కేంద్రం పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంకు సంబందించి ఈవిఎంల కమిషనింగ్ కేంద్రమైన ఏసి కాలేజిని కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఎస్.పి.కార్తీక గురువారం రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు ఏసి కాలేజిలో ఈవిఎంల తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లో ర్యాండమైజేషన్ మేరకు ఈవిఎంలను, వివిప్యాట్ లు, సియుల ను ఆర్డర్ లో ఏర్పాటు చేయడం పరిశీలించారు. అనంతరం ఈవిఎం ల కమిషనింగ్ హాల్ పరిశీలించి కమిషనింగ్ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, సిబ్బంది అందరూ ఎన్నికల విధుల గుర్తింపు కార్డ్ లు ధరించాలన్నారు. తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లు, అవసరమైన ఈవిఎంలు, కమిషనింగ్ కు తీసుకుంటున్న చర్యలు వివరించారు. పర్యటనలో ఏఆర్ఓ, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఏసిపి మురళి, ఈ.ఈ. సుందర్రామిరెడ్డి, ఎంహెచ్ఓ(ఎఫ్ఏసి) మధుసూదన్, డిఈఈ రమేష్ బాబు, ఏఈ సునీల్ కుమార్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *