Breaking News

ఉచిత చిన్నారుల గుండె ఆపరేషన్లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రా హాస్ప‌ట‌ల్‌, హీలింగ్ లిటిట్ హార్ట్స్ యూకె చారిటీ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగువేలు చిన్న‌పిల్ల‌ల గుండె స‌ర్జ‌రీలు ఉచితంగా విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ట్లు ఆంధ్రా హాస్ప‌ట‌ల్ డైరెక్ట‌ర్‌, ప్ర‌ముఖ చిన్న‌పిల్ల‌ల వైద్యులు డాక్ట‌ర్ పీవీ రామారావు తెలిపారు. శుక్రవారం సూర్యారావుపేట‌లోని ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్ప‌ట‌ల్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో డాక్ట‌ర్ పీవీ రామారావు మాట్లాడుతూ వివ‌రాలు వెల్ల‌డించారు. ఆంధ్ర హాస్పిటల్స్‌లో హీలింగ్ లిటిల్ హార్ట్స్, యుకె చారిటీ సౌజన్యంతో 29వ ఉచిత పిల్లల గుండె సర్జరీలు క్యాంపు ఏప్రిల్ 29వతేదీ నుండి మే 4 వరకు జరిగిందని విదేశీ వైద్య బృందం డా. ఆండ్రూపారి, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ బ్రిస్టల్ యూకే డాక్టర్ జోరోతి లిడ్ బెటర్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాక్ ఇంటెన్సవిస్ట్ డా. ఒరిజిత్ బెనర్జీ,కొచురని సెబాస్టియన్, హెలీ ఫిట్జ్ పాట్రిక్, అలెగ్జాండర్ టేలర్ తదితరులు బ్రిస్టల్, యూకే నుండి ఇక్కడకు వచ్చి హార్ట్ అండ్ బ్రెయిన్ ఆంధ్ర హాస్పిటల్స్ డా.సాయిరాం, కార్డియాక్ సర్జన్ తో కలిసి, ఆంధ్ర హాస్పిటల్స్‌లో 15 మంది చిన్న‌పిల్లలకు గుండె ఆపరేషన్లు నిర్వహించారు. అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులు -ఐయోర్ట్- పల్మనరి విండో విత్ ఇంటేర్రప్ట్ డ్ అయోర్టీక్ ఆర్చ్, అబ్స్ స్తక్టీవ్ టోటల్ అనోమలౌస్ పల్మనరీ వేనోస్ కనెక్షన్స్ (TAPVD), మైట్రల్ వాల్వ్(PARACHUTE) రిపేర్, టెట్రాలజీ అప్ ఫాలో, పిఏ బాండింగ్ ఇతర క్లిష్టమైన గుండె ఆపరేషన్లు ఈ క్యాంపులో నిర్వహించారు. గత ఎనిమిదేళ్ళుగా ఇప్పటివరకు 29సార్లు ఆంధ్ర హాస్పిటల్స్‌కు వచ్చి పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేశారు.

ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్ర హాస్పటిల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకె డాక్టర్లు, నర్సులు, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. విలేక‌రుల స‌మావేశంలో డా. విక్రమ్, పిల్లల కార్డియాలజిస్ట్, డా. నాగేశ్వరరావు, డా.సాయిరామ్, కార్డియాక్ సర్జన్ డా. శ్రీమన్నారాయణ, సీనియర్ కార్డియాలజిస్ట్, డా. రమేష్, కార్డియాక్ ఎన్‌స్టిటిస్ట్, డా.రేవంత్ పిల్లల కార్డియాక్ ఇంటెన్సివిస్ట్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *