Breaking News

పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ నిర్వహణ, ఈవిఎం కమిషనింగ్ చేపట్టాలి

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలలో విధులు నిర్వర్తించే సిబ్బందికి, అత్యవసర శాఖలో పనిచేసే ఉద్యోగులు, అత్యవసర సర్వీసుల శాఖలు, పోలింగ్ విధులకు హాజరయ్యే మీడియా వారికి అథారిటీ లెటర్ మేరకు, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లు ఎవరైతే నిర్ణీత దరఖాస్తులో గడువులోపు ఫారం 12 & 12డి సమర్పించిన వారు ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని మే 5, 6వ తేదీలలో వినియోగించు కోవచ్చునని, హోం ఓటింగ్ 6 నుండి పక్కాగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం పారదర్శంగా చేపట్టాలని, ఈవిఎం కమిషనింగ్ రేపటి నుండి అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు.

శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారిణి లతో కలిసి అన్ని నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులతో, సహాయ రిటర్నింగ్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన బ్యాలెట్ పేపర్ నేటి శనివారం రోజు సాయంత్రానికి అందుతాయని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయుచున్న అభ్యర్థులకు సమాచారం అందించి ఈవీఎంల కమిషనింగ్ కు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని రేపు మే5న ఉదయం 8 గంటల నుండి ఈవీఎంల కమిషనింగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినవి ప్రారంభించాలని, మే 6న మధ్యాహ్నం నుండి పార్లమెంట్ నియోజకవర్గ ఈవీఎం ల కమిషనింగ్ చేపట్టి ఏడో తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంటుందని, తదనుగుణంగా చర్యలు చేపట్టాలని ఈవిఎం ల కమిషనింగ్ లో సెక్టరల్ అధికారులను భాగస్వాములు చేయాలని అన్నారు. అంతేకాకుండా మే 5, 6 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ సమాంతరంగా ఉంటుందని ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి సంబందించి వారికి ఏ నియోజక వర్గంలో అయితే ఓటు ఉంటుందో ఆ నియోజక వర్గం నిర్దేశిత ఫెసిలిటేశన్ సెంటర్ నందు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవాల్సి ఉంటుందని, భారత ఎన్నికల సంఘం సవరించిన నిబంధన 18 A ప్రకారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ఉద్యోగులు తప్పనిసరిగా ఫెసిలిటేశన్ కేంద్రంలోని డ్రాప్ బాక్స్ నందు తప్పనిసరిగా బ్యాలెట్ ను వేయాలని అన్నారు. అంతే కాకుండా ఇతర జిల్లాలో ఓటు కలిగి తిరుపతి జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు శ్రీవేంకటేశ్వర హై స్కూల్ క్క్యాంపస్, న్యూ బాలాజీ కాలనీ నందు తమ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవాలని సూచించారు. ఏ కార్యక్రమానికి సంబంధించి దానికి సిబ్బందికి విధులు విడిగా కేటాయించి పక్కాగా జరిగేలా చూడాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొరకు కంపార్ట్మెంట్ ఏర్పాటు ఉండాలని, ఏజెంట్ల సమక్షం లో మైక్రో అబ్జర్వర్ ఏర్పాటుతో నిర్వహించాల్సి ఉంటుందని బందోబస్తు పక్కాగా ఉండాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ ప్రశాంతంగా పారదర్శకంగా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా జరగాలని సూచించారు. హోమ్ ఓటింగ్ అత్యంత పారదర్శకంగా చేపట్టాలని కంపార్ట్మెంట్ ఏర్పాటు తో ఓటింగ్ సీక్రసి కి ఎలాంటి భంగం కలగకుండా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో కావాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత సదరు పోస్టల్ బ్యాలెట్ ను రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికలలో పోటీ చేయుచున్న అభ్యర్థుల సమక్షంలో సంబంధిత నియోజకవర్గం ఇంటీరిం స్ట్రాంగ్ రూమ్ నందు భద్రపరచాలని కౌంటింగ్ కొరకు ప్రోటోకాల్ ప్రకారం తేవాల్సి ఉంటుందని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కొరకు విధులు కేటాయించబడిన సిబ్బందికి కనీస సౌకర్యాలు తప్పక కల్పించాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *