Breaking News

పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను సందర్శన

పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలు సందర్భంగా ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉద్యోగులకు సూచించారు. 77-పామర్రు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పామర్రు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను శనివారం కలెక్టర్ సందర్శించారు. పోస్టల్ ఓటింగ్ కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు పరిశీలించారు. పార్లమెంటు, అసెంబ్లీలకు వేరువేరుగా ఓటింగ్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని, సంబంధిత ఫారాలు, బ్యాలెట్లు ఉంచే కవర్లపై బ్యాలెట్ నెంబర్లు కరెక్ట్ గా వేయాలని, పోలైన ఓట్లు ఇన్ వ్యాలీడ్ కాకుండా ఉద్యోగులకు జాగ్రత్తలు తేలపాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ విధులు కేటాయించిన ప్రొసైడింగ్ అధికారులు సహాయ ప్రొసైడింగ్ అధికారులు మైక్రో అబ్జర్వర్లకు ఈరోజు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల హెడ్క్వార్టర్స్ లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 5వ తేదీ ఓపిఓలకు, 6వ తేదీ పోలీస్ సిబ్బంది, ఎసెన్షియల్ సర్వీసెస్, డ్రైవర్లు వీడియో గ్రాఫర్లు తదితరులకు అన్ని అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటు కలిగి ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు 6వ తేదీ జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పాండురంగ మున్సిపల్ హైస్కూల్లో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రిటర్నింగ్ అధికారి శ్రీదేవి, సహాయ టర్నింగ్ అధికారి,మొవ్వ తాసిల్దార్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *