మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పోలింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులు, డ్రైవర్లు, వీడియో గ్రాఫర్లు, పోలీస్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 5, 6 తేదీల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు ఈనెల 5వ తేదీన ఓపిఓలకు, 6 వ తేదీన పోలీస్ సిబ్బంది, ఎసెన్షియల్ సర్వీసెస్, డ్రైవర్లు, వీడియో గ్రాఫర్లు, తదితరులకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఏ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆ జిల్లాలోనే ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఆ ప్రకారం కృష్ణా జిల్లాలో ప్రస్తుతం పని చేస్తూ ఇతర జిల్లాలో ఓటు ఉన్న ఉద్యోగులకు ఈ నెల 6 వ తేదీన మచిలీపట్నం లోని పాండురంగ హై స్కూలు నందు ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, వారు అక్కడ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు ఈనెల 7వ తేదీ, 8 వ తేదీలలో నిరంతరం ఫెసిలిటీ కేంద్రాలను రిటర్నింగ్ అధికారుల వద్ద ఏర్పాటు చేస్తున్నామని ఎవరైనా ఇంకనూ తప్పిపోయి ఉంటే తప్పిపోయిన ఓటర్లు కానీ సిబ్బంది గాని పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చన్నారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేవారు వారికి ఏ నియోజకవర్గంలో ఓటు ఉన్నదో అదే చోట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ లో ఫెసిలిటేషన్ సెంటర్లు పోస్టల్ ఓటింగ్ కోసం ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్లు గన్నవరంలో జడ్పీ హైస్కూల్ బాయ్స్, గుడివాడలో వికేఆర్ వి ఎన్ బి ఇంజనీరింగ్ కళాశాల, పెడనలో వాసవి ఇంజనీరింగ్ కళాశాల ( నందమూరు), మచిలీపట్నంలో నోబుల్ కళాశాల, అవనిగడ్డలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పామర్రు ఎస్ కె ఆర్ ఆర్ జడ్పీ హైస్కూల్, పెనమలూరు లో జడ్పీ హైస్కూల్ లలో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు సంబంధించి మచిలీపట్నం చిలకలపూడి లోని పాండురంగ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఫెసిలిటిషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు.
Prajavartha Online Telugu News