-పోస్టల్ బ్యాలెట్ కు అర్హత ఉన్న ఉద్యోగులందరు ఓటు హక్కు వినియోగించు కొనేలా సంబందిత అధికారులు చూసేలా ఇసి చర్యలు తీసుకోవాలి.
-పోస్టల్ బ్యాలేట్ వేసేందుకు ఉద్యోగులను ఇంకోకరోజు రావాలని వెనక్కి పంపిస్తున్న విధానాలు మానుకోవాలి.
-సకాలంలో ఇవ్వలేదని తిరస్కరించిన ఆర్టీసీ ఉద్యోగుల ఫారం..12 డి లను తిరిగి పరిగణలోకి తీసుకుని వెంటనే వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించాలి.
-పోస్టల్ బ్యాలేట్ నమోదుకు మరోక్కసారి అవకాశం కల్పించి ఉద్యోగులంతా ఓటుహక్కును వినియోగించేలా ఇసీ చర్యలు తీసుకోవాలి.
-బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం ఆంద్రప్రధేశ్ లో 2024 సంవత్సరం లోక్ సభ/శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చూడాలని, ఉద్యోగులు నిన్న, ఈ రోజు కొన్ని జిల్లాలలో పోస్టల్ బ్యాలెట్ వినియోగం సందర్భంగా జరుగుతున్న సంఘటనలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుని, ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ వేసుకొనే సౌకర్యాన్ని కలించేలా రాష్ట్రంలోని అందరూ జిల్లా ఎన్నికల అధికారులకు, రిటర్నింగ్ అధికారులను భాద్యులుగా చేయాలని కోరారు.
గత సాధారణ ఎన్నికలతో పోలిస్తే, ఈసారి అధిక సంఖ్యలో ఓటుహక్కు వృదా కాకుండా ఎన్నికలరోజు విధులు ఉన్న ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించు కోవాలన్న ఉద్దేశం ఉన్నందున, పోస్టల్ బ్యాలేట్ ద్వారా ఓటు వేసుకొనేందుకు నిన్న, ఈ రోజు ఎదురౌతున్న ఇబ్బందులపై గౌః ప్రధాన ఎన్నికల కమీషనర్ గారు ప్రత్యేకదృష్టి పెట్టి, పోస్టల్ బ్యాలెట్ వేసుకేనేందుకు వచ్చే ఉద్యోగులకు ఎటువంటీ ఇబ్బందులు కలకగకుండా, ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతి ఒక్క ఉద్యోగి అనగా పి.ఓ/ఏ.పి.ఓ/
ఓ.పి.ఓ/బి.యెల్.ఓ/ఆర్టీసి సిబ్బంది తదితరులతో పాటు ఇటీవల అదనంగా ఎన్నికల విధులకు కేటాయించిన అంగన్వాడీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా
తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, స్టేట్ అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, స్టేట్ కోశాధాకారి వి.వి.మురళి కృష్టనాయుడు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కే.రమేష్ కుమార్ లు ఆదివారం ఒక ప్రకటద్వారా డిమాండ్ చేసారు.
పోస్టల్ బ్యాలెట్ వేసుకోవాలన్న ఉత్సహాముతో ఫెసిలిటేషన్ సెంటర్లకు వస్తున్న ఉద్యోగుల మధ్య అధికారులు ఎందుకు ఇంత గందరగోళం సృష్తిస్తున్నారో అర్దంకాని పరిస్దితి ఉందని, ఉదాహరణకు నిన్న పోలింగ్ మొదలైనప్పటికీ ఏలూరు, ప్రకాశం లాంటి కొన్ని జిల్లాల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించు కోకుండానే, వెనుతిరిగారు.
అలాగే ఈ రోజు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు యన్టీఆర్ జిల్లాలో వచ్చే ఉద్యోగులకు ఓట్లు లేవని కొంతమందికి, వచ్చిన ఉద్యోగులకు కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా గంటలు గంటలు గా క్యూలైన్లలో పెట్టి ఇబ్బందులకు గురిచేయడము సరీకాదని వారు అన్నారు.
అలాగే కోనసీమజిల్లా అమలాపురం నుండి పోస్టల్ బ్యాలేట్ వేసేందుకు వెళ్లీన ఆర్టీసి ఉద్యోగులను ఇంకోకరోజు రావాలని కలెక్టర్ కార్యాలయం లో సంబంధిత అధికారులు వారందరినీ వెనక్కి పంపించేసారు. అలాగే ఆర్టీసి లో పనిచేసే కండక్టర్లు/డ్రైవర్లు డ్యూటీలు కొన్ని చోట్ల 24×7 మాధిరిగా ఉంటాయి.ఇలాంటి వారు దురప్రాంతాలకు డ్యూటీలకు వెళ్లే సిబ్బందికి ఎన్నికలరోజు ఓటు వేసే అవకాశం ఉండదు. అలాంటి వారికోసం ఫారం..12 డి ద్వారా పోస్టల్ బ్యాలేట్ సౌకర్యం కల్పించారు కాని పోస్టల్ బ్యాలేట్ నమోదుగడువు మే 1 వరకు ఎన్నికల కమీషనర్ గడువు ఇచ్చినప్పటికీ ఫారం 12 డి ద్వారా దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు మాత్రం గతనెల 22 తరువాత వచ్చినవన్ని తిరస్కరించి నందువలన చాలా మంది ఆర్టీసి ఉద్యోగులు ఓటుహక్కును వినియోగించుకొనే అవకాశాన్ని కోల్పోతున్నందున,ఈ పరిస్దితులన్నింటినీ పరిగణలోకి తీసుకొని పారం 12 గాని ఫారం 12 డీ ద్వారా గానీ పోస్టల్ బ్యాలేట్ నమోదుకు మరోకసారి అవకాశం కల్పించేలా గడువు పెంచి అందరు ఉద్యోగులు ఓటు హక్కు వీనియోగించు కొనేలా గౌఃప్రధాన ఎన్నికల కమీషనర్ గారు తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి తరుపున విజ్ఞప్తి చేస్తున్నామని బొప్పరాజు,పలిశెట్టి దామోదరరావు తెలిపారు.
Prajavartha Online Telugu News