Breaking News

మహిళలపై వేధింపులు పాల్పడితే కఠిన చర్యలు… : గజ్జల వెంకటలక్ష్మి చైర్ పర్సన్ మహిళా కమిషన్

-టిడిపి నేత మహిళపై వేధింపుల ఘటనపై మహిళా కమిషన్‌ సీరియస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కంకిపాడు కు చెందిన టిడిపి నేత గుమ్మడి కిరణ్ మహిళపై వేధింపులు పాల్పడిన ఘటనపై మహిళా కమిషన్‌ సీరియస్‌ అయింది. ఈ ఘటన కేసును సుమోటోగా స్వీకరించింది. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఘటనపై మహిళా కమిషన్‌ సీరియస్‌ అయింది. ఈ ఘటన కేసును సుమోటోగా స్వీకరించింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, పూర్తి వివరాలు వెల్లడించాలని కృష్ణా జిల్లా ఎస్పీకి మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి లేఖ రాశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజకీయం పేరిట ఇటీవల తెలుగుదేశం పార్టీ కి చెందిన కొంతమంది కీచకులు మహిళలపై చేస్తున్న అరాచకాలపై ఉక్కు పాదం మోపాలని, వారి భరతం పట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత మహిళ వివరాలపై గోప్యత పాటించాలని, రక్షణ కల్పించాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *