Breaking News

విద్యాహక్కు చట్టం ప్రకారం అర్హులైన నిరుపేద బాలలకు 25125 పాఠశాలల్లో ఉచిత సీట్లు

-ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యాహక్కు చట్టం ప్రకారం, సెక్షన్ 12 (సి ) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్రములోని ప్రైవేట్ మరియు అన్‌ఎయిడెడ్ పాఠశాలలో అర్హులైన తక్కువ ఆదాయము గల బడుగ వర్గాల నిరుపేద కుటుంబాల బాలలు, సామాజిక వర్గాల , అనాథ బాలలకు వారి బంగారు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని 26 జిల్లాలకు సంబంధించి ” 25125″ మంది బాలలకి రాష్ట్ర విద్యాశాఖ వారు ఉచితంగా ప్రవేశాలును కల్పించడం జరిగింది. వారికి పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా ఏటువంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రవేశాలు కల్పించాలని సూచించారు.రాష్ట్రం లో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరంలో అత్యధిక సీట్లు గణనీయంగా పెరగడం చాలా అభినందించవలసిన విషయం అని ఆంధ్ర ప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు. బాలల హక్కుల కమిషన్ ఈ విద్యాహక్కు చట్టం పనితీరుపై విద్యా శాఖ సమన్వయంతో పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సీట్ల కేటాయింపులో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి ప్రవేశాలు కల్పించాలని, ఉల్లంఘనకు పాల్పడిన విద్యాసంస్థలపై కమిషన్ ద్వారా కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు మంగళగిరి లోని కమిషన్ కార్యాలయానికి ఈ ఇమెయిల్ apscpcr2018@gmail కు ఫిర్యాదు చేయవొచ్చని అప్పారావు సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *