Breaking News

తప్పనిసరిగా ఎంసీఎంసి నుండి ముందస్తు అనుమతి పొందాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 13వ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు గాని ఇతరులు గాని వారికి సంబంధించిన ఎన్నికల రాజకీయ ప్రచార ప్రకటనలు ప్రింట్ మీడియా (వార్తాపత్రికల)లో ఈనెల 12, 13 తేదీలలో ప్రచురించే ముందు తప్పనిసరిగా ఎంసీఎంసి నుండి ముందస్తు అనుమతి పొందాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు.

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఈనెల 12, 13వ తేదీలలో వార్తాపత్రికల్లో (ప్రింట్ మీడియాలో) ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా ఎవరైనా సరే ఎన్నికల రాజకీయ ప్రచార ప్రకటనలు ప్రచురించుకోవాలంటే రెండు (2) రోజులు ముందుగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) ని సంప్రదించి దరఖాస్తులు అందజేసి వారికి కావలసిన అనుమతులు ముందస్తుగా పొందాలని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు.

అలాగే వార్తాపత్రికలు( ప్రింట్ మీడియా) యాజమాన్యం కూడా ఈ విషయం గమనించి వారి పత్రికలలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల, ఇతరుల రాజకీయ ప్రచార ప్రకటనలు ప్రచురించే ముందు తప్పనిసరిగా ఎం సి ఎం సి నుండి పొందిన అనుమతి ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన తర్వాతనే వారి పత్రికలలో ప్రచురించాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు.

కావున పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఇతరులు తమ రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతులు పొంది జిల్లా ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఇతరులను జిల్లా ఎన్నికల అధికారి కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *