-మంత్రి ఆర్కేరోజా
-తడుకుపేట, ముడిపల్లి, మేళపట్టు పంచాయతీల్లో జోరుగా ఎన్నికల ప్రచారం
-రెట్టింపు అభిమానంతో ఆహ్వానించిన ప్రజలు
నగరి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్యాన్ ప్రభంజనానికి కూటమి గల్లంతు కావడం కాయమని మంత్రి ఆర్కేరోజా అన్నారు. బుధవారం రూరల్ మండలం తడుకుపేట, ముడిపల్లి, మేళపట్టు పంచాయతీల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి పంచాయతీలోను ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. హారతులు పట్టి మహిళలు ఆహ్వానించారు. పూలదండలతోను, దుస్సాలువలతోను సత్కరించారు. ఆప్యాయతతో పలకరించారు రెట్టింపు అభిమానాన్ని ప్రదర్శించారు. మంత్రి వారికి తాను చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరించారు. 35 యేళ్లలో ఎవరూ చేయనటువంటి అభివృద్ధిని తాను చేశానని గర్వంగా చెబుతున్నానన్నారు. అభివృద్ధి, సంక్షేమం అందించా, పలు సేవాకార్యక్రమాలు చేశా, నేరచరిత లేకుండా, ఎలాంటా గొడవలు లేకుండా నియోజకవర్గాన్ని ప్రశాతంగా ఉంచి విధులు నిర్వహించా అందుకే ధైర్యంగా అడుగుతున్నా నాకు ఓటెయ్యండి… నాకు మాత్రమే ఓటెయ్యండి అన్నారు. ఈ మాటలను జనం ఉత్సాహపూరితంగా చేతులెత్తి తమ సంకేతాన్ని ప్రదర్శించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమం అందిందని, సంక్షేమం అందుకున్నవారు తమ విశ్వసనీయత చాటుతూ అలాంటి ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనానికి కూటమి పార్టీలు గల్లంతు కావడం కాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News