Breaking News

పోలింగ్ విధులకు హాజరయ్యే పోలింగ్ పార్టీ సంక్షేమం బాధ్యతగా నిర్వహించాలి

-సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రానున్న నాలుగు రోజుల్లో చేపట్టాల్సిన విధులపై ఆర్.ఓ, ఎఆర్.ఓ లకు, సెక్టార్ అధికారులకు, బిఎల్వో తదితర ఎన్నికల సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
-ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రిసైడింగ్ అధికారులు, సెక్టర్ అధికారుల పాత్ర కీలకం
-రిటర్నింగ్ అధికారులు వారి నియోజక వర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు సజావుగా జరిగేలా సమన్వయంతో పక్కా ప్రణాళికతో అప్రమత్తంగా నిర్వహించాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
-పోలీస్ అధికారుల డిప్లాయ్మెంట్ చేసి పక్కా ప్రణాళికతో ఎన్నికలను ప్రశాంత నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నాం: ఎస్పి కృష్ణ కాంత్ పటేల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మే13 న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రానున్న నాలుగు రోజుల్లో చేపట్టాల్సిన విధులపై ఆర్.ఓ, ఎఆర్.ఓ లకు, సెక్టార్ అధికారులకు, బిఎల్వో తదితర ఎన్నికల సంబంధిత అధికారులకు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ దిశా నిర్దేశం చేసి మాట్లాడుతూ పోలింగ్ విధులకు హాజరయ్యే పోలింగ్ పార్టీ సంక్షేమం బాధ్యతగా నిర్వహించాలని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు సెక్టర్ అధికారుల, రూట్ మొబైల్ ల పాత్ర కీలకం అని, రిటర్నింగ్ అధికారులు వారి నియోజక వర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు సజావుగా జరిగేలా సమన్వయంతో పక్కా ప్రణాళికతో అప్రమత్తంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ సంబంధిత రిటర్నింగ్ అధికారులు, జిల్లా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారి,
సెక్టర్ అధికారులు పోలింగ్ కు నాలుగు రోజులు ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు సందర్శించి అన్ని వసతులు ఉన్నాయా లేదా అని ధృవీకరించుకోవాలి. సెక్టార్ అధికారి రిటర్నింగ్ అధికారికి బూత్ లెవెల్ స్థాయి అధికారికి మధ్య అనుసంధానకర్తగా ఉంటారని తెలిపారు. పోలింగ్ రోజుకు ముందు రోజు మధ్యాహ్నం నుండి పోలింగ్ కేంద్రానికి వచ్చే పోలింగ్ పార్టీ 6 మందికి, మైక్రో అబ్జర్వర్ వారికి బిఎల్వో లు భోజన, వసతి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని తెలిపారు. మూడు రోజుల ముందు బిఎల్వో కనీస మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని, సెక్టర్ అధికారులు ధృవీకరించు కోవాల్సి ఉంటుందని తెలిపారు. వీల్ చైర్స్, ఓటర్ అసిస్టెన్స్ డెస్క్, టాయిలెట్స్, త్రాగు నీరు, షేడ్ ఏర్పాటు ఉన్నాయా అని చూసుకోవాలని తెలిపారు. పోలింగ్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ (పీడిఎంఎస్) ద్వారా అన్ని పోల్ డే రోజున రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని, ప్రిసైడింగ్ అధికారికి, బూత్ లెవెల్ అధికారులకు, సెక్టార్ అధికారులకు ఈ పీడిఎంఎస్ పై ఒక వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ అంశంపై అవగాహన కల్పించాలని రిటర్నింగ్ అధికారికి సూచించారు. పోలింగ్ డే రోజు మాక్ పోల్, పోలింగ్ పర్సంటేజ్ రిపోర్టింగ్, ఈవిఎం సీలింగ్, పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రిసెప్షన్ కేంద్రంలో ఈవిఎం లు, సంబంధిత నివేదికలు పీ.ఓ లు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. సెక్టర్ అధికారులు డిఈఓ కు కళ్ళు చెవులు వంటి వారని, సెక్టార్ అధికారులు, రూట్ మొబైల్ ప్రతి రెండు గంటలకు ఒకసారి వారి పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఏదైనా సమస్యలుంటే సత్వరమే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలని కోరారు. మన జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సెక్టార్ అధికారి, రూట్ మొబైల్ వారి రోల్ చాలా ముఖ్యమని సూచించారు. సాధారణ, వ్యయ పరిశీలకులు, పోలీస్ పరిశీలకులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఈసిఐ కి నివేదిస్తుంటారని, జిల్లాలో ఎన్నికల నిర్వహణ పక్కాగా ఉండేలా ప్రణాళికా బద్ధంగా బాధ్యతగా అందరూ కలిసి సమన్వయంతో పని చేయాలని సూచించారు. సెక్టర్ అధికారులు పోలింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ఉన్నాయా లేదా అని పరిశీలించాలని అన్నారు. పోలింగ్ సిబ్బంది వెల్ఫేర్ కొరకు సంబంధిత అధికారులు పక్కాగా చర్యలు ఉండాలని, అలాగే ఓటరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు పోలింగ్ వేసే విధంగా పర్యవేక్షించాలని సూచించారు. రిటర్నింగ్ అధికారి తమ నియోజక వర్గంలో పూర్తి బాధ్యత ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో త్రాగు నీరు, షేడ్, మెడికల్ టీమ్ ఓఆర్ఎస్, ఫ్లూయిడ్స్ ఏర్పాటు, వీల్ చైర్స్ తదితరాలు ఉండాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ప్రిసైడింగ్ అధికారి మరియు సంబంధిత టీమ్ పోలింగ్ కేంద్రానికి బస్సులో బయల్దేరాల్సి ఉంటుందని, సెక్టార్ అధికారి, రూట్ మొబైల్ వారితో పాటు పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ ఉంటారని, హాఫ్ సెక్షన్ సిఎపీఎఫ్ కేంద్ర బలగాలు ఉంటాయని తెలిపారు. పోలింగ్ స్థానాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. పోలింగ్ రోజున ఎంసిసి, సి-విజిల్ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా కేంద్రం నుండి అన్ని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూ అప్రమత్తంగా చర్యలు ఉంటాయని తెలిపారు. పోలింగ్ కేంద్రం నుండి పోలింగ్ పూర్తి అయిన వెంటనే ఈవిఎం లను నేరుగా రిసెప్షన్ కేంద్రంలో అందజేయాల్సి ఉంటుందని ఎలాంటి నిర్లక్ష్య వైఖరి ఉండరాదని అన్నారు. పోలీస్ శాఖ నుండి బందోబస్తు ఏర్పాటు ఉంటుందని తెలిపారు. రిటర్నింగ్ అధికారి తన స్థాయిలో మానిటరింగ్ కొరకు టివి ఏర్పాటుతో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. మీడియాలో కానీ, లేదా ఏదైనా ఇన్స్ట్రక్షన్ జిల్లా కేంద్రం నుండి వస్తే సత్వరమే దానికి హాజరయ్యేలా ఒక అధికారికి బాధ్యతలు కేటాయించాలని సూచించారు. జిల్లా కేంద్రం నుండి సీనియర్ అధికారి సమన్వయం ఉంటుందని తెలిపారు. అవసరమైన చోట బ్యారికేడింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులు వారి పరిధిలో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు పక్కాగా పూర్తి చేసి ఎఎస్డి లిస్ట్ తయారీ కావాలని, పోలింగ్ సిబ్బంది సరిపడా వచ్చారా అనేది, పోలింగ్ పార్టీ కి అన్ని ఏర్పాట్లు చేయాలని, ఫిమేల్ పోలింగ్ సిబ్బందికి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండేలా చూడాలని ఆదేశించారు. యుద్ధం, ఎన్నికలు ఎంతో ప్రణాళికా బద్ధంగా బాధ్యతగా చేపడితేనే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. వాలంటీర్లను ఎన్నికలలో వాడరదని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు ఉండాలని సూచించారు. నోడల్ అధికారులు వారి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు.

ఎస్పీ మాట్లాడుతూ 46 రూట్ మొబైల్ లు ఏర్పాటు చేశామని, ఎస్హెచ్ఓ లు, ఎస్డిపిఓ లు, సీనియర్ పోలీస్ అధికారులు అదనపు ఎస్పి తగినంత పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు ఉంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో ధ్యానచంద్ర, అదితి సింగ్, ఇతర అసెంబ్లీ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులు, అదనపు ఎస్పీ వెంకట్రావు, జిల్లా నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *