తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులు పంపిణీ పై నగరపాలక సంస్థ కార్యాలయంలో 167- తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారిని అదితి సింగ్ తో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ గారు బిఎల్వో లతో సమావేశం నిర్వహించి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం స్థానిక తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ నందు బిఎల్వో లతో విఐఎస్ పంపిణీ పై సమీక్షిస్తూ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు సంబంధిత ఓటరుకు పంపిణీ చేయాల్సి ఉంటుందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించరాదని సూచించారు. అనంతరం అక్కారం పల్లి లోని నలంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారితో కలిసి తనిఖీ చేసారు.
Prajavartha Online Telugu News