Breaking News

ట్రైనీ ఐ పి ఎస్ లను అభినందించిన కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల విధులలో భాగస్వామ్యం అవ్వడం ఒక మంచి అవకాశం అని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లో శిక్షణా నిమిత్తం జిల్లాకు కేటాయించబడిన ట్రైనీ ఐ.పి.ఎస్., జిల్లా కలెక్టర్ ను ఛాంబర్ లో జిల్లా ఎస్పీ పి జగదీష్ సమక్షంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందనీ అన్నారు. ఆమేరకు జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీసు బందోబస్తు మధ్య సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడం లో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం ముఖ్యం అన్నారు. పోలీసు , భధ్రత యంత్రాంగ వ్యవస్థ నిర్వర్తించాల్సిన ఎన్నికల విధి విధానాల పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి. జగదీష్ వివరిస్తూ, ట్రైనీ పోలీసు అధికారులను జిల్లాలోని వివిధ నియోజకవర్గాలలో ఎన్నికల విధుల నిర్వహణలో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *