Breaking News

అధికారులకు, ఏ ఎల్ ఎం టి లకు జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ సజావుగా, సక్రమంగా నిర్వహించుటకు సెక్టార్ అధికారులు కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి గురువారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో సెక్టార్ అధికారులకు, ఏ ఎల్ ఎం టి లకు జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రీసైడింగ్ అధికారులకు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు, సెక్టార్ అధికారులకు ఇప్పటికే రెండు మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చామన్నారు. ఈవీఎం మేనేజ్మెంట్ సిస్టం గురించి, ఈవీఎం ఎర్రర్స్, రీప్లేస్మెంట్ ప్రోటోకాల్ గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, తద్వారా ఈవీఎంలు మొరాయించాయనే మాట రాకుండా పోలింగ్ సక్రమంగా జరిగేలా కృషి చేయాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో చెప్పిన విషయాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి మండలంలో ఏఎల్ఎంటిలను ఏర్పాటు చేస్తున్నట్లు, వీరు ప్రిసైడింగ్ అధికారులతో కలిసి సెక్టార్ అధికారులు ఒకే జట్టుగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. పోల్ డే మేనేజ్మెంట్ సిస్టం గురించి ప్రత్యేక వెబ్ పేజ్ రూపొందించినట్లు, దీని ద్వారా పోలింగ్ సంబంధించి ప్రతి స్టెప్ అప్డేట్ చేయవలసి ఉంటుందన్నారు.

వేసవి కాబట్టి ఉదయం 10 గంటలలోపు, మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత ఎక్కువగా పోలింగ్ జరిగే అవకాశం ఉందన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో విద్యుత్ సౌకర్యం, తగినంత లైటింగ్ ఉండేలా ముందుగా తనిఖీ చేసుకోవాలన్నారు. ఈసీ నిబంధనలు అనుసరించి ప్రణాళికా బద్దంగా పోలింగ్ జరుపుటకు కృషి చేయాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులకు మార్గదర్శకంగా ఉండి ఎన్నికలు సక్రమంగా సజావుగా నిర్వహించుటకు కృషి చేయాలని సెక్టార్ అధికారులకు సూచించారు.

తొలుత డిఆర్ఓ కె చంద్రశేఖర రావు మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో ఈవీఎంలు ఎంత ముఖ్యమో రిపోర్టింగ్ కూడా అంతే ముఖ్యం అన్నారు. కావున ప్రతి ఫారం కరెక్ట్ సమాచారంతో నింపుటలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. శిక్షణ నోడల్ అధికారి మురళీ కిషోర్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి జడ్పీ సీఈవో ఆనందకుమార్, ఎన్నికల విభాగం సమన్వయ అధికారి దుర్గా కిషోర్ మాస్టర్ ట్రైనర్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *