Breaking News

స్ట్రాంగ్ రూములు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు పరిశీలన…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఎన్నికల కౌంటింగ్ కేంద్రం కృష్ణా విశ్వవిద్యాలయం సందర్శించి వివిధ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించారు. కృష్ణ విశ్వవిద్యాలయంలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించిన స్ట్రాంగ్ రూములలో పోలింగ్ అనంతరం ఈవీఎంలు భద్రపరిచేందుకు అసెంబ్లీల వారీగా వేరువేరు మార్గాలు ఏర్పాటుకు అవసరమైన బార్కేడింగ్ పనులు కలెక్టర్ పరిశీలించారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి పార్లమెంటు, అసెంబ్లీ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, వీటన్నిటిని అనుసంధానించి, అభ్యర్థులు వారి ప్రతినిధులు పరిశీలించేందుకు సీసీటీవీలు డిస్ప్లే రూములు పార్లమెంటు, అసెంబ్లీలకు వేరు వేరుగా ఏర్పాటు చేయాలన్నారు.

వివిధ నియోజకవర్గాల పరిశీలకులకుల కోసం కేటాయించిన రూములలో టీవీలు, అవసరమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, వీరి కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. పోలింగ్ అనంతరం వచ్చే వాహనాలు పార్కింగ్ స్థలాల్లో వర్షం కారణంగా ఇబ్బందులు ఏర్పడకుండా క్వారీ డస్ట్ తో పటిష్టపరచాలన్నారు.

ఏఎస్పి లు జి.వెంకటేశ్వరరావు, ఎస్విడి ప్రసాద్, ఏడి సర్వే మనిషా త్రిపాఠి, పంచాయతీరాజ్ ఎస్ఈ విజయకుమారి, ఆర్ అండ్ బి ఈఈ కే శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *