Breaking News

సుజనాను గెలిపించుకుంటాం…

-నగరాల నేతలు రాంపిళ్ళ, పిల్లా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని అత్యధిక మెజారిటీ గెలిపించుకుంటామని నగరాల సామాజిక వర్గ నేతలు తెలిపారు. బీజేపీ ఎన్నికల కార్యాలయంలో నగరాల సంఘ నేతలు రాంపిల్ల శ్రీనివాసరావు, పిల్లా శ్రీను, బాయన శేఖర్ బాబు, బాయన అచ్యుత రావు, గుజ్జారీ అమర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. పశ్చిమానికి సరైన అభ్యర్థిగా సుజనాను భగవంతుడే పంపించారని, నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కంకణ బద్ధులయి ఉన్నారని రాంపిల్ల శ్రీను అన్నారు.మౌలిక వసతుల కల్పన కు సుజనా తన ప్రణాళికను వివరించాక వెస్ట్ కు ఆయనే సరైన నాయకుడిగా తాము గుర్తించామని తెలిపారు. సుజనాను భారీ మెజారిటీ గెలిపించుకునేందుకు నగరాల సామాజిక వర్గం తీర్మానించుకుందని తెలిపారు. సైకో జగన్ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. పిల్లా శ్రీను మాట్లాడుతూ నగరాలకు కళ్యాణ మండపానికి వేయి గజాల స్థలం కోరితే సుజనా అంగీకరించారని, తమ దేవస్థానం అభివృద్ధికి కూడా ఆయన కృషి చేస్తానని చెప్పారనీ ఈ కారణంగా సుజనాని గెలిపించేందుకు తాము అందరం నిర్ణయించుకున్నామని శ్రీను తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *