-మైనారిటీ నాయకురాలు మొబినా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి నియోజకవర్గ ముస్లింలు అండగా ఉన్నారని మైనారిటీ నాయకురాలు షేక్ మొబినా అన్నారు. బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మీడియాతో శుక్రవారం మాట్లాడారు. కొండ ప్రాంతాల ప్రజలకు సుజనా చౌదరి ఇళ్ల పట్టాలు మంజూరుపై సానుకూలంగా స్పందించారన్నారు. ప్రజల సమస్యలపై ఆయన అధ్యయనం చేయడం గమనిస్తే ప్రజలపై సుజనా నిబద్ధత అర్థం అవుతోందని అన్నారు. పంజా సెంటర్లో పవన్ కళ్యాణ్ ముస్లిం సామాజిక వర్గం పట్ల ప్రేమ కురిపించారని అన్నారు. టీడీపీ హయాంలో ముస్లింలకు రంజాన్ తోఫా వంటి సౌకర్యాలు కల్పించారని, అయితే వైసీపీ హయాంలో రద్దు చేశారని, వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో సుజనాను ముస్లింలు గెలిపించుకుంటారని మొబినా ధీమా వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News