Breaking News

చివరి రోజు కూడా తగ్గని అదరణ

-అదే ప్రచార హోరు
-ఇబ్రహీంపట్నం లో కొనసాగుతున్న వసంత శీరిష ఎన్నికల ప్రచారం

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల ప్రచారం లో భాగంగా శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం లోని ఎ ,సి కాలనీలో వసంత శీరిష ఇంటింటి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు అత్మీయ స్వాగతం పలికి హరతులు పట్టి అశీర్వదిస్తూ ఘనమైన స్వాగతం పలికారు. ఇంటింటి ప్రచారం నిర్వహించిన శీరిష గారు వృద్దులు, మహిళలను కలిసి తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణి చేశారు. కాలనీలో దేవాలయాల్లో ప్రతేక పూజలు నిర్వహించగా. వేద పండితులు అక్షింతలు వేసి అశీర్వదించారు. ఈ సందర్బంగా శీరిష వారితో మాట్లాడుతూ ఈ నెల 13 న జరుగునున్న సార్వత్రిక ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యే గా పోటీచేస్తున్న వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారికి ఈవియం లో 4 వ నెంబర్ లో నోక్కి సైకిల్ గుర్తు పై మీ ఓటు వేయాలని విజ్ణప్తి చేశారు. అలానే యంపి అభ్యర్థిగా పోటీచేస్తున్న కేశినేని శివనాధ్ గారికి ఈవియం లో 1 వ నంబర్ పై నోక్కి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో స్థానిక పార్టీ నాయకులు తెలుగు మహిళలు జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీలకు చెందిన మహిళలు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గణనాధుడిని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *