Breaking News

అత్మీయ సమావేశంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు

కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన ముఖ్య నాయకులు, ఐటీ ఉద్యోగులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన అత్మీయ సమావేశం లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు పాల్గొన్నారు. కొండపల్లి లోని జనసేన పార్టీ కార్యాలయం లో నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ అక్కల రామ్మోహన్ (గాంధీ) అధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశం పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ… కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్  ముందుచూపు మనందరికి అదర్శమన్నారు. కొండపల్లి ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది చెందుతున్న కాలుష్యం కోరల్లో చిక్కుకుపోతుందని సమస్య పరిష్కారం కోసం అందరం కలిసి ముందుకు సాగాలని విజ్ణప్తి చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు  అవసరం ఈ రాష్ట్రానికి ఐటి పరిశ్రమలు అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. ఎన్డీఏ కూటమి కి అందరం మద్దతు తెలిపి పవన్ కళ్యాణ్  సారథ్యం లో ఈ రాష్ట్రానికి చంద్రబాబుని మరోసారి ముఖ్యమంత్రి గా చేద్దామని సైకిల్ గుర్తులపై ఓట్లు వేయించాలని విజ్ణప్తి చేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక జనసేన నాయకులు కార్యకర్తలు ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *