-పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగునీరు, మెడికల్ క్యాంపు, బ్యారికేడింగ్, షామియానాలు ఏర్పాటు చేయాలి
-ఎన్నికల సజావుగా నిర్వహణలో సెక్టోరియల్ అధికారుల పాత్ర చాలా ముఖ్యమైనది
-సెక్టోరియల్ అధికారులు పోలింగ్ బూత్ లను పోలీస్ టీమ్ రూట్ మొబైల్ తో కలిసి పరిశీలిస్తూ ఉండాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలు- 2024 సందర్బంగా పోలింగ్ ముందు రోజు మరియు పోలింగ్ రోజు జరిగే ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు సక్రమంగా జరగాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక మునిసిపల్ కార్యాలయం మరియు ఆర్.డి.ఓ కార్యాలయం నందు ఎన్నికల పోలింగ్ ముందు రోజు మరియు పోలింగ్ రోజు చేపట్టే ఏర్పాట్లపై సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్.ఓ కి పి.ఓ మధ్య సెక్టోరల్ అధికారుల పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. వారికి కేటాయించిన అన్నీ పోలింగ్ బూత్ లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు బాధ్యతగా అన్ని పోలింగ్ కేంద్రాలను సెక్టర్ రూట్ మొబైల్ టీమ్ (పోలీస్ టీమ్) తో కలిసి తప్పకుండా పరిశీలించాలని సూచించారు. మొబైల్ లో PDMS యాప్ లో మాక్ పోల్, ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం వివరాలను పీ.ఓ అప్డేట్ చేయాలని సదరు విషయాలను పోలింగ్ సిబ్బందికి తెలపి అవగాహన కల్పించాలని, వారు అప్లోడ్ చేసిన ప్రతి రిపోర్ట్ ను ఎన్నికల కమిషన్ వారు చూస్తుంటారని తెలిపారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రం నందు వెబ్ కాస్టింగ్ ఉంటుందని, మిగిలిన పోలింగ్ స్టేషన్స్ నందు వీడియో గ్రాఫర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏజెంట్లు ఆర్డర్ కాపీతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారిని రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్, ఇండిపెండెంట్ పార్టీలవారిని ప్రాధాన్యత క్రమంలో పోలింగ్ కేంద్రాల్లో స్థలం అందుబాటు మేరకు పి.ఓ కూర్చోబెట్టాలన్నారు. రిజర్వడ్ ఈ. వి.ఎం లు సెక్టర్ అధికారి దగ్గర ఉంటాయని ఏదయినా ఈ. వి. ఎం సమస్య వస్తే వివరాలు నమోదు చేసి రీప్లేస్ చేయాలని, ఒకవేళ సదరు సెక్టార్ అధికారి వద్ద అందుబాటులో లేకపోతే ఇతర సెక్టార్ అధికారి వద్ద నుండి తీసుకొని రికార్డు చేసి ఇవ్వాలని తెలిపారు. ఈ. వి. ఎం ల రిపేర్ వస్తే బెల్ ఇంజనీర్స్ కూడా అందుబాటులో ఉంటారన్నారు. నేడు పోలింగ్ సిబ్బంది మూడవ ర్యాండమైజేషన్ పూర్తి అయ్యిందని, రేపు పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సంబంధిత నియోజక వర్గాలలో జరుగుతుందని అన్నారు. ఏదైనా ఓటరు ఎపిక్ లేకుండా వచ్చి వారి ప్రత్యామ్నాయ ఐడి ప్రూఫ్ ను పి.ఓ గారికి చూపిస్తే వారు అర్హులైతే పి.ఓ నిర్ణయం తీసుకోవచ్చు. ఓటు వేసే ముందు ఓటరుకు చెరిగిపోని ఇంక్ సక్రమంగా 5 సెకన్ల పాటు వేయాలని, పోలింగ్ పూర్తి అయిన తర్వాత పోలింగ్ ఏజెంట్లు దగ్గర ఫారం 17సి మీద సంతకం చేయించుకొని వారికి ఒక కాపీ ఇవ్వాలన్నారు. సెక్టోరయల్ అధికారికి ఎన్నికల పోలింగ్ రోజు జ్యూడిషల్ పవర్స్ ఉంటాయాని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతగా విధులు నిర్వహించాలని తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూం ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. తిరుపతి, చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కొరకు ఈసిఐ నుండి వచ్చిన అనుమతి మేరకు శత శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ మరియు 167- తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిని అదితిసింగ్,166- చంద్రగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిషాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News