Breaking News

క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు

-ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్
-నేటి నుంచి వైజాగ్‌లోని హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రిలో సమగ్ర క్యాన్సర్ కేర్ ప్రోగ్రామ్‌పై టిఓటి ల కోసం రాష్ట్ర స్థాయి శిక్షణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించగలిగితే రోగి ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఐఎఎస్ నేడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఏపీ ఆరోగ్య శాఖ చేపట్టిన కార్యక్రమం క్యాన్సర్‌ వ్యాధి ముందస్తు గుర్తింపు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తోందన్నారు. రోగ ప్రారంభ నిర్ధారణ మరియు చికిత్స రోగులను క్లిష్ట సమస్యల దశ నుండి కాపాడటమే కాక వారి జీవిత కాలాన్ని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా వయోజన జనాభా అందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించడానికి రాష్ట్ర స్థాయిలో భారీ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ ఎం.టి.కృష్ణబాబు మార్గదర్శకత్వంలో ఆరోగ్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన పేర్కొన్నారు.
హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ సమన్వయం, సహకారంతో ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క్యాన్సర్ స్క్రీనింగ్‌పై శిక్షణ నిచ్చేందుకు ఈ ప్రణాళికను రూపకల్పన చేసిందన్నారు. మెడికల్ కాలేజీలకు చెందిన ప్రివెంటివ్ ఆంకాలజిస్టులు 3 బ్యాచ్‌లలో సెన్సిటైజేషన్ కార్యక్రమానికి హాజరవుతారని ఆయన వివరించారు. వీరు మే 14 నుండి విశాఖపట్నంలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ లో రాష్ట్రంలోని సమగ్ర క్యాన్సర్ సంరక్షణపై శిక్షణ తీసుకుని జిల్లా స్థాయి శిక్షకులకు (టిఓటి) శిక్షణ ఇస్తారు. . ఈ సిసిసిపిలో మొత్తం 3,244 మంది వైద్యాధికారులు (పిహెచ్ సిల నుండి 2702 మంది, యుపిహెచ్ సిల నుండి 542 మంది ), అలాగే అన్ని ప్రాంతాల సామాజిక ఆరోగ్యాధికారులు (సిహెచ్ఓలు), అర్బన్ ఎఎన్ఎం లకు సెకండరీ హెల్త్ ఆసుపత్రుల నుండి శిక్షణ అందిస్తామని ఆయన వెల్లడించారు. 580 మంది జిల్లా టిఓటిలు అంటే సెకండరీ హెల్త్ స్థాయి ఆరోగ్యకేంద్రాలు, జిల్లా స్థాయి ఎన్సిడి టీమ్‌ల నిపుణులు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ నిర్వహిస్తారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న నివాసితులందరినీ లక్ష్యంగా చేసుకుని, సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధుల (ఎన్పి, ఎన్సిడి) నివారణ మరియు నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా శిక్షణ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మూడు రకాల క్యాన్సర్లకు అంటే నోటి, రొమ్ము మరియు గర్భాశయ ముఖద్వార స్క్రీనింగ్‌కు ప్రాధాన్యత వుంటుందని ఆయన తెలిపారు. ఈ బహుముఖ విధానంలో ముందస్తు రోగనిర్ధారణలతో పౌరులకు పూర్తి అవగాహన కల్పించడం లక్ష్యంగా ముందడుగు వేస్తామన్నారు. ఇది విజయవంతమైన మెరుగైన చికిత్స కు దారితీస్తుందన్నారు.
ఈ వ్యూహంలో మూడు కీలక అంశాలుంటాయని ఆయన వివరించారు.
సెకండరీ, ప్రైమరీ హెల్త్ కేర్ ఉద్యోగులందరికీ శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఇది జూన్ చివరి నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం సహకారంతో నిర్వహించే ఈ శిక్షణలో స్క్రీనింగ్ విధానాలకు నాణ్యత, నియంత్రణ చర్యలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
శిక్షణ పొందిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సిహెచ్ఓలు), ఎఎన్ఎంలు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లను సందర్శించి స్క్రీనింగ్ డ్రైవ్‌ నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు.
తదుపరి స్క్రీనింగ్‌లు, అవసరమైన దశల వారీ రోగనిర్ధారణ ప్రక్రియలు మరియు అవసరమైన వాటిని అన్ని మెడికల్ కాలేజీలలో వైద్యాధికారులు సులభంగా నిర్వహిస్తారని కమీషనర్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *