అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) స్థాపన & 1865లోని మొట్టమొదటి అంతర్జాతీయ టెలిగ్రాఫ్ కన్వెన్షన్ ఒప్పందానికి గుర్తుగా, ప్రతి సంవత్సరం మే 17న ‘వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ’ దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం నేపథ్యాంశం ‘సుస్థిరాభివృద్ధి కోసం డిజిటల్ ఆవిష్కరణ’. స్థిరమైన అభివృద్ధి సాధించడంలో, డిజిటల్ అంతరాలను తగ్గించడంలో టెలికమ్యూనికేషన్స్, సమాచార సాంకేతికతలు పోషించే కీలక పాత్రను ఇది చాటి చెబుతుంది. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన క్షేత్రస్థాయి యూనిట్‌గా ఆంధ్రప్రదేశ్‌లోని ‘కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్’ కార్యాలయం పని చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు ఈ కార్యాలయం నిబద్ధతతో ముందడుగు వేస్తోంది.
1. అత్యధిక పన్నుయేతర రాబడి వసూళ్లు:
ఆంధ్రప్రదేశ్‌లోని టీఎస్పీలు, ఐఎస్పీలకు సంబంధించిన లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలను వసూలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌కు ‘ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్’ (సీసీఏ) బాధ్యత వహిస్తుంది. ఈ కార్యాలయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.841 కోట్ల వసూళ్లు చేసి భారత ప్రభుత్వానికి అత్యధిక పన్నుయేతర ఆదాయాన్ని అందించింది.
2. అందుబాటును పెంచడం:
యూఎస్‌వోఎఫ్ నిధులతో ఏపీ సర్కిల్ సీసీఏ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన కొన్ని కీలక ప్రాజెక్టులు:
• వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు దశ-I: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 2,199 స్థానాల్లో మొబైల్ సేవలను అందించడం కోసం ఒక ప్రాజెక్టు.
* భారత్ నెట్ ప్రాజెక్ట్: భారత్ నెట్ అనేది ప్రపంచంలోని అతి పెద్ద గ్రామీణ టెలికాం ప్రాజెక్టుల్లో ఒకటి. అన్ని టెలికాం సంస్థల కోసం దేశంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో (సుమారు 2.5 లక్షలు) దశలవారీగా అమలైంది. మొబైల్ ఆపరేటర్లు, ఐఎస్పీలు, కేబుల్ టీవీ ఆపరేటర్లు, సమాచార ప్రదాతలు వంటి సంస్థలు మన దేశంలోని గ్రామీణ & మారుమూల ప్రాంతాల్లో ఇ-హెల్త్, ఇ-ఎడ్యుకేషన్, ఇ-గవర్నెన్స్ వంటి సేవలను ప్రారంభించడానికి వీలు కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
* వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు దశ-II: మన రాష్ట్రంలో దీనిని భారతి ఎయిర్టెల్ అమలు చేస్తోంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు దశ-IIలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించిన స్థానాల్లో 4G ఆధారిత మొబైల్ సేవలను అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించిన 211 స్థానాల్లో 154 టవర్లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి.
* ఆంధ్రప్రదేశ్‌లోని 3 ఆకాంక్షిత జిల్లాల్లోని 1,218 గ్రామాలను కవర్ చేస్తూ 4G ఆధారిత సేవలను అందించే ప్రాజెక్టు.
* సేవలు అందని గ్రామాలకు సంతృప్తికర స్థాయిలో 4G ఆధారిత మొబైల్ సేవలు: దేశవ్యాప్తంగా మారుమూల, క్లిష్టమైన ప్రాంతాల్లోని 24,680 గ్రామాల్లో 4G ఆధారిత మొబైల్ సేవలను ఈ ప్రాజెక్టు అందిస్తుంది. దీంతోపాటు, 2G లేదా 3G సేవలు ఉన్న 6,279 గ్రామాల్లోనూ 4G సేవలు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ చొరవలో భాగంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.
3. సాంకేతికతను సంపూర్ణంగా ఉపయోగించుకోవడం- ఎండ్ టు ఎండ్ సేవలు:
సరస్ (ఆదాయ నిర్వహణ వ్యవస్థ): భారతదేశవ్యాప్తంగా ఉన్న అందరు లైసెన్స్దార్ల ప్రయోజనం కోసం సరస్‌ను రూపొందించారు. లైసెన్స్ కాలంలో, డాట్ సహా అన్ని లావాదేవీలు, అనుసంధానతలతోపాటు పత్రాల సమర్పణ, ఎల్ఎఫ్/ఎస్‌యూసీ చెల్లింపులు, ఫిర్యాదులకు సమర్పణ, ప్రతిస్పందన వంటివి ఈ వ్యవస్థ ద్వారా అందుబాటులో ఉంటాయి.
టెలికాం ప్రచార కార్యక్రమాలు: లైసెన్సుదారుల్లో అవగాహన పెంచడానికి ఏపీ సర్కిల్ సీసీఏ ద్వారా ఈ కార్యక్రమాలను ప్రతి త్రైమాసికంలో నిర్వహిస్తారు.
సంపన్న్: టెలికమ్యూనికేషన్స్ విభాగం ఆధ్వర్యంలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ (సీజీసీఏ) విభాగం చేపట్టిన చొరవ సంపన్న్. “సిస్టమ్ ఫర్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ పెన్షన్”కు ఇది సంక్షిప్త నామం. ఒక సమీకృత సాఫ్ట్వేర్ ద్వారా అందుతున్న అంతరాయాలు లేని పింఛను నిర్వహణ వ్యవస్థ ఇది. పింఛను దరఖాస్తుల పరిశీలన, మంజూరు, చెల్లింపు విభాగాలను ఇది ఒకే వేదిక కిందకు తీసుకువస్తుంది.
టెలికాం ఫెసిలిటేషన్ సెంటర్ & పెన్షనర్ హెల్ప్‌లైన్
జీవన్ ప్రమాణ్ పోర్టల్‌తో అనుసంధానం ద్వారా, పింఛనుదార్లు తమ జీవన ధృవీకరణ పత్రాన్ని ఆన్లైన్లోనే సమర్పించడానికి ఇది వీలు కల్పిస్తుంది.
4. కార్యక్రమాలు & కార్యకలాపాలు:
‘వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ’ దినోత్సవం సందర్భంగా, టీఎస్పీలు, ఐఎస్పీలు, యూఎస్పీలు సహా అందరు ప్రధాన వాటాదార్లతో పరస్పర అనుసంధాన కార్యక్రమాన్ని ఏపీ సీసీఏ నిర్వహించింది. టెలికాం రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికలు, సవాళ్లపై ఈ కార్యక్రమంలో లోతైన చర్చ జరిగింది. దీనివల్ల పరిశ్రమ భవిష్యత్‌పై అవగాహన పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో ఏపీ సీసీఏ కొత్త కార్యాలయం ఏర్పాటైంది. 2023లో ఐఎస్వో ధృవపత్రాన్ని ఈ కార్యాలయం అందుకుంది. అవే నాణ్యత లక్ష్యాలను నిలకడగా పాటించడానికి, నెరవేర్చడానికి, నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి దృఢంగా కట్టుబడి ఉంది. నాణ్యత ప్రమాణాలను కఠినంగా పాటిస్తూ వర్తమానంలో పురోగతిని సాధిస్తూనే, భవిష్యత్ లక్ష్యాలను సాధించడంపైనా దృష్టి పెట్టింది. మెరుగుదల కోసం నిరంతర ప్రయత్నించడం ఏపీ సీసీఏ కార్యకలాపాల్లో ప్రధానమైనది.
సేవలు అందించే వ్యవస్థలను మెరుగుపరచడానికి, అవి సమర్థవంతంగా & ప్రభావవంతంగా పని చేసేలా చూసుకోవడానికి ఏపీ సీసీఏ అంకితభావంతో పని చేస్తోంది. సంస్థ అందిస్తున్న సేవలను మెరుగుపరచడానికి వాటాదార్ల అభిప్రాయం అత్యంత కీలకం.
టెలికమ్యూనికేషన్ రంగంలోని వాటాదార్లందరికీ ఆంధ్రప్రదేశ్‌లోని కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. అనుసంధాన మౌలిక సదుపాయాలు, సేవలను సమర్థవంతంగా మార్చడంలో వాటాదార్ల సహకారం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు, అనుసంధానత & ఆవిష్కరణలు దేశంలోని మూలమూలకు చేరేలా చూస్తుంది.
Prajavartha Online Telugu News