తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోల్డ్ ఈవిఎం లు భద్రపరచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించి, మీడియా సెంటర్, పార్కింగ్ ఏర్పాట్ల కొరకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరియు సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
మంగళవారం సదరు స్ట్రాంగ్ రూంల భద్రత పరిశీలించి, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్ల పై, మీడియా కేంద్రం, పార్కింగ్ ఏర్పాట్ల కొరకు కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడుతూ భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ కొరకు బ్యారికేడింగ్ పక్కాగా ఉండాలని, మీడియా సెంటర్, పవర్ సప్లై నిరంతరంగా ఉండేలా జనరేటర్ తగు సామర్థ్యం ఉండేలా ఏర్పాటు ఉండాలని పలు సూచనలు చేశారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూం నందు ఈవిఎం లను పరిశీలించారు. సందర్శకుల రిజిష్టర్ నందు సంతకాలు చేశారు.
వీరి వెంట తిరుపతి రిటర్నింగ్ అధికారిని అదితి సింగ్, అదనపు ఎస్పీలు కులశేఖర్, వెంకట్రావు, విమల కుమారి, శ్రీనివాస రావు, ఎస్.ఈ ఆర్ అండ్ బీ మధుసూధన్ రావు, ఆర్డీఓ కిరణ్ కుమార్, నిషాంత్ రెడ్డి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News