Breaking News

రాజకీయ పార్టీల ప్రతినిధులతో కౌంటింగ్ పై సమావేశం

-ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగానికి సహకారం అందించాలి
-లా అండ్ ఆర్డర్ కు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది
-కౌంటింగ్ ఏజెంట్స్ సమాచారం ముందస్థుగా అందజేయాలి
-పాస్ ఉండి, ఆధారటి లేఖలు ఉన్నా వారినే అనుమతించడం జరుగుతుంది
-నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలోకి వాహనాలు అనుమతి లేదు
-కౌంటింగ్ ఏజెంట్స్ కొరకు దివాన్ చెరువు తదితర ప్రాంతాల్లో షటిల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం
-ఎన్నికల ప్రవర్తనా నియమావళి జూన్ 6 వరకు అమలులో
-ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్ధులు, వారి మద్దతు దారుల ద్వారా బాణసంచా వినియోగం, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
-కౌంటింగ్ సందర్భంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి
-కౌంటింగ్ కోసం ఒక పార్లమెంటు ఏడు అసెంబ్లి నియోజకవర్గ హాల్స్ లలో 129 టేబుల్స్ ఏర్పాటు
– జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓట్ల లెక్కింపు సందర్భంలో కౌంటింగ్ కేంద్రాలలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినా, ఉల్లంఘనలకు పాల్పడినా అటువంటి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని చివరి వ్యక్తి వరకూ వెళ్లేలా అభ్యర్ధులు, రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని కలక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. శుక్రవారం ఉదయం కలక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో రాజకీయ పార్టీల, అభ్యర్ధుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఏ సి పి. అనీల్ కుమార్, పార్లమెంటు నియోజక వర్గ సహయ రిటర్నింగ్ అధికారి ఆర్ కృష్ణ నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం. భాను ప్రకాష్, అభ్యర్ధులు, ఏజెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *