-ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగానికి సహకారం అందించాలి
-లా అండ్ ఆర్డర్ కు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది
-కౌంటింగ్ ఏజెంట్స్ సమాచారం ముందస్థుగా అందజేయాలి
-పాస్ ఉండి, ఆధారటి లేఖలు ఉన్నా వారినే అనుమతించడం జరుగుతుంది
-నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలోకి వాహనాలు అనుమతి లేదు
-కౌంటింగ్ ఏజెంట్స్ కొరకు దివాన్ చెరువు తదితర ప్రాంతాల్లో షటిల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం
-ఎన్నికల ప్రవర్తనా నియమావళి జూన్ 6 వరకు అమలులో
-ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్ధులు, వారి మద్దతు దారుల ద్వారా బాణసంచా వినియోగం, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
-కౌంటింగ్ సందర్భంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి
-కౌంటింగ్ కోసం ఒక పార్లమెంటు ఏడు అసెంబ్లి నియోజకవర్గ హాల్స్ లలో 129 టేబుల్స్ ఏర్పాటు
– జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓట్ల లెక్కింపు సందర్భంలో కౌంటింగ్ కేంద్రాలలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినా, ఉల్లంఘనలకు పాల్పడినా అటువంటి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని చివరి వ్యక్తి వరకూ వెళ్లేలా అభ్యర్ధులు, రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని కలక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. శుక్రవారం ఉదయం కలక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో రాజకీయ పార్టీల, అభ్యర్ధుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు కోసం ఈ వి ఎమ్ ఓట్లను ఒక సూపర్ వైజర్, సహాయకులు, మైక్రో అబ్జర్వర్ ఒక్కో టేబుల్ వద్ద , పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్ వైజర్, సహాయకులు, మైక్రో అబ్జర్వర్, ఈ టీ పి బి ఎస్ ఓట్ల లెక్కింపు కోసం ఒక సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్ వైజర్, సహాయకులను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల పరిశీలకులు సహాయకులుగా ఒక సహాయకుడు, ఇద్దరు మైక్రో అబ్జర్వర్స్ ను నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తదుపరి మాత్రమే ఐదు ఈ వి ఎమ్ లకు చెందిన వివి పాట్స్ లోని ఓట్లను లెక్కించడం జరుగుతుందనీ, వాటినీ లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తదుపరి మాత్రమే ఐదు ఈ వి ఎమ్ లకు చెందిన వివి పాట్స్ లోని ఓట్లను లెక్కించడం జరుగుతుందనీ, వాటినీ లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం ఈ వి ఎమ్ ఓట్లను ఒక సూపర్ వైజర్, సహాయకులు, మైక్రో అబ్జర్వర్ ఒక్కో టేబుల్ వద్ద , పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్ వైజర్, సహాయకులు, మైక్రో అబ్జర్వర్, ఈ టీ పి బి ఎస్ ఓట్ల లెక్కింపు కోసం ఒక సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్ వైజర్, సహాయకులను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల పరిశీలకులు సహాయకులుగా ఒక సహాయకుడు, ఇద్దరు మైక్రో అబ్జర్వర్స్ ను నియమించినట్లు తెలిపారు
కౌంటింగ్ ప్రక్రియ కోసం ఎంపిక చేసే అధికారులు సిబ్బందిని 3 దశల్లో సాంకేతిక పరమైన విధానంలో ర్యాండమైజెషన్ చేస్తామని తెలిపారు. కౌంటింగ్ టేబుల్స్ సంఖ్య మేరకు కౌంటింగ్ ఏజెంట్స్ ను అనుమతిస్తామని, ఆ మేరకు ఐడి కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. నేర చరిత్ర కలిగిన, బైండోవర్ కేసులు నమోదు అయిన వ్యక్తులను కౌంటింగ్ ఏజెంట్స్ గా నియమాకం జరగకుండా అభ్యర్థులు రాజకీయ పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. అభ్యర్థి తన తరపున ఒక ఏజెంట్ కౌంటింగ్ కేంద్రం లోని అనుమతిస్తామని, ఇద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే ఉండడానికి అవకాశం ఉందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ లో తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అరగంట ముందు ప్రారంభం చేసి, అనంతరం ఈ వి ఎంలలో పొలైనా ఓట్లు లెక్కించనున్నట్లు తెలియ చేయండి. రౌండ్ వారీగా లెక్కింపు పూర్తి అయిన తర్వాత ఫలితాలు వివరాలు ఏజెంట్స్ కీ కాపీ లనూ ఇస్తామని , వాటిని ఫారం 17 సి తో నిర్దారణ చేసుకోవాలని కోరారు.
బాణాసంచా వినియోగంచడం పై నిషేధం విధించినట్లు తెలిపారు. ర్యాలీలు సభలు సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, కౌంటింగ్ కేంద్రాలలో ఎటువంటి ఉల్లంఘన పాల్పడరదని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రౌండ్ వారీగా ఆయా యూనిట్స్ సురక్షితంగా స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరచనున్నట్లు తెలియ చేశారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఏ సి పి. అనీల్ కుమార్, పార్లమెంటు నియోజక వర్గ సహయ రిటర్నింగ్ అధికారి ఆర్ కృష్ణ నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం. భాను ప్రకాష్, అభ్యర్ధులు, ఏజెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News