Breaking News

ఏ పి పి ఎస్ సి నిర్వహించే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలి

-అభ్యర్థులను ఉ. 7.30 గం. ల నుండి ఉ. 8.30 గం. ల లోపు పరీక్ష కేంద్రాలలోకి అనుమతి : డి ఆర్ ఓ పెంచల్ కిషోర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నియామకం కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనెల 25 న జిల్లాలో 11 పరీక్ష కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందని, సంబంధిత శాఖలు సమన్వయంతో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని డి ఆర్ ఓ పెంచల్ కిషోర్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోనే డిఆర్ఓ ఛాంబర్ లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధర్వంలో నిర్వహించే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ భర్తీ కోసం స్క్రీనింగ్ పరీక్ష ఈనెల 25న ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాలలో ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్షలకు 840 మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు. పరీక్షా సమయం ఉ. 9 నుంచి 11. 30 లు వరకు ఉంటుందని అన్నారు. ఉ.7.30 గం. ల నుండి ఉ.8.30 గం.ల మధ్య మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రం లోకి అనుమతించడం జరుగుతుందని అన్నారు. క్షణం ఆలశ్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్యశాఖ వారు ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేసుకోవాలని, పోలీస్ శాఖ వారు తగిన బందోబస్తు నిర్వహించాలన్నారు . అభ్యర్థుల రవాణా సదుపాయం కోసం ఆర్టీసీ తగు ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలోకి మొబైలు ఫోన్ లు, డిజిటల్ వాచ్ లు వంటి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరని, హాల్ టికెట్, గుర్తింపు కార్డు, వాటర్ బాటిల్ ను మాత్రమే అనుమతిస్తారన్నారు. అభ్యర్థుల మొబైలు ఫోన్ లను డిపాజిట్ చేసుకోవడానికి పరీక్షా కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేయాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. ఈ సమావేశానికి సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *