Breaking News

పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై తుమ్మలపల్లి కళాశాక్షేత్రంలో శిక్షణ కార్యక్రమం…

-కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 28వ తేదీ మంగళవారం పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై తుమ్మలపల్లి కళాశాక్షేత్రంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు తెలిపారు. సాధారణ ఎన్నికలలో భాగంగా జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రకియలో భాగంగా పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు స్థానిక తుమ్మలపల్లి కళాశాక్షేత్రంలో మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. గతంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని మొగల్రాజపురంలోని పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారని వేదిక మార్పును గమనించి అధికారులు తుమ్మలపల్లి కళాశాక్షేత్రంలో శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *