-జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈవిఎం లు భద్రపరచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం, భద్రత నేపథ్యంలో బ్యారికేడిoగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలన చేసారు. సోమవారం సాయంత్రం స్ట్రాంగ్ రూం వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడిoగ్ ఏర్పాట్లు లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. స్ట్రాంగ్ రూం భద్రత నేపథ్యంలో బ్యారికేడిoగ్ లను పక్కాగా ఏర్పాటు చేయాలని తెలిపారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, కంట్రోల్ రూం నందు ఈవిఎం నందు భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట రిటర్నింగ్ అధికారి నిశాంత్ రెడ్డి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News