Breaking News

ఏపీ ఈసెట్ ఫ‌లితాల విడుద‌ల‌

– ఫ‌లితాల్లో 90.41 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు
– మే 8న రాష్ట్రవ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలలో ఈసెట్ ప‌రీక్ష‌
– పరీక్షకు మొత్తం 36,369 మంది విద్యార్థులు హాజరు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ ఈసెట్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. గురువారం ఉద‌యం అనంత‌పురం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) లో ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్ కే. హేమ‌చంద్ర‌రెడ్డి, ఈసెట్ ఛైర్మ‌న్ శ్రీనివాస‌రావు ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఈసెట్ ఫ‌లితాల్లో 90.41 శాతం మంది ఉత్తీర్ణులైన‌ట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ఫ‌లితాల‌ను పొందవచ్చ‌ని అధికారులు వెల్ల‌డించారు. ఇక ఈ ప్రవేశ పరీక్షను మే 8న రాష్ట్రవ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 36, 369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీ ఈసెట్ 2024 జ‌వాబు కీని మే 10న విడుదల చేసిన అధికారులు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *