అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో ప్రవేశం కొరకు నిర్వహించిన డిఈఈ సెట్2024 ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. డిఈఈ సెట్2024 కన్వీనర్ మరియు జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మేరీ చంద్రిక పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారి కార్యాలయంలో డిఈఈ సెట్2024 ప్రవేశ పరీక్ష ఫలితాలనువిడుదల చేశారు. ఈ పరీక్షకు 4949మంది అభ్యర్థులు హాజరు కాగా 3191 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.
మ్యాథమెటిక్స్ విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థి బులుసు గ్రీష్మిత (హాల్ టికెట్ నెంబర్ 24057013 ), ఫిజికల్ సైన్స్ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థి కేసన మీనాక్షి (హాల్ టికెట్ నెంబర్ 24057063), బయలాజికల్ సైన్స్ విభాగంలో కడప జిల్లాకు చెందిన అభ్యర్థి షేక్ రుక్సాన ( హాల్ టికెట్ నెంబర్24059914), సాంఘిక శాస్త్ర విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన అభ్యర్థి గుత్తా సునీల్ కుమార్ (హాల్ టికెట్ నెంబర్24057923) మొదటి ర్యాంకు సాధించారు. జూన్ 6 నుండి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని జూన్ 20 వ తేదీ నుండి కోర్సు ప్రారంభమవుతుందని తెలియజేశారు.
Prajavartha Online Telugu News